Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీఆర్ యస్ సీనియర్ నాయకులు ఆర్జేసీ కృష్ణకు అన్యాయం…

టీఆర్ యస్ సీనియర్ నాయకులు ఆర్జేసీ కృష్ణకు అన్యాయం…
-మంత్రి అనుచరుడిగా ముద్ర
-జిల్లా అధ్యక్ష పదవిని ఆశించిన కృష్ణ
-అందుకోసం జిల్లా కార్యాలయ ఇంఛార్జిగా బాధ్యతలు నిర్వహణ
-సొంత ఖర్చులతో కార్యాలయలో మార్పులు చేయించిన కృష్ణ

ఆర్జేసీ కృష్ణ కు టీఆర్ యస్ పార్టీలో అన్యాయం జరిగింది… ఆయనకు అంతకుముందు మార్కెట్ కమిటీ చైర్మన్ గా చేశారు . అనంతరం మరో టర్మ్ వస్తుందని అనుకున్న రాలేదు . ఇక చేసేది లేక మంత్రి అజయ్ ని నమ్ముకుని ఉన్నారు. ఎవరు ఎన్ని చెప్పిన అజయ్ వెంట తిరుగుతున్నారు. జిల్లా పార్టీ కార్యాలయం ఇంఛార్జిగా అజయ్ అప్పగించిన భాద్యతలను తూచ తప్పకుండా పాటించారు . స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీ గా అవకాశం వస్తుందని మంత్రి అండదండలు ఉన్నందున అది పెద్ద ఇబ్బంది కాదని అనుకున్నారు. కానీ అనుకోకుండా అనేక సమీకరణాల్లో అది జిల్లాకు చెంది రాష్ట్ర కార్యదర్శి బాధ్యతల్లో ఉన్న తాతా మధుకు దక్కింది. దీంతో ఆయనకు జిల్లా పార్టీ అధ్యక్ష భాద్యతలు అప్పగించేందుకు మంత్రి తీవ్రంగా ప్రయత్నించారు . కానీ దాన్ని కూడా రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాలకు ప్రోటోకాల్ ఉన్న ఎమ్మెల్యేలు , ఎంపీలు , ఎమ్మెల్సీలకు ఇవ్వడంతో అదికూడా తాతా మధుకే దక్కింది. దీంతో ఆర్జేసీ కృష్ణ ఆశలు అడియాశలు అయ్యాయి. దీనితో ఆయన మనస్తాపం చెందారు . గతంలో పార్టీ కార్యాలయానికి రెగ్యులర్ గా వచ్చే కృష్ణ అధ్యక్షుడు ప్రకటన రావడంతో పార్టీ కార్యాలయానికి రావడం మానేశారు . దీనిపై మంత్రి కూడా ఆరాతీశారు . స్వయంగా ఆర్జేసీ ఇంటికి వెళ్లిన మంత్రి ఆయనకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు . మంత్రి మాటలకు మెత్తపడ్డప్పటికీ పార్టీ లో అన్యాయం జరిగిందనే దాని నుంచి ఆయన బయట పడలేకపోతున్నారు.

ఆర్జేసీ కృష్ణ ఉద్యమకాలంలో పార్టీకి అండదండలుగా ఉన్నారు . తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ ఇచ్చిన పిలుపులకు ఆకర్షితుడై పనిచేశారు . ఖమ్మం లో ఉద్యమ ప్రభావం బాగా లేకపోయినా కృష్ణ లాంటి కొందరు తెలంగాణ వాదాన్ని వినిపించేందుకు తమ వంతు కృషి చేశారు .అందువల్లనే 2014 తెలంగాణ రాష్ట్రానికి మొదటిసారి జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ఖమ్మం అసెంబ్లీ టికెట్ ను ఆర్జేసీ కృష్ణకు ఇచ్చారు. సీటు ఓడిపోతుందని తెలిసినప్పటికీ పార్టీని నిలబెట్టేందుకు పార్టీ తరుపున ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు . ప్రచారానికి సొంత డబ్బులు కూడా పెద్ద ఎత్తునే ఖర్చు పెట్టుకున్నారు. అయినప్పటికీ ఓటమి తప్పలేదు . నాడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన పువ్వాడ అజయ్ ఎమ్మెల్యే గా ఖమ్మం నుంచి గెలుపొందారు . కొద్దిరోజుల తరువాత అజయ్ కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీఆర్ యస్ లో చేరారు . తిరిగి మరుసటి ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న అజయ్ కు టీఆర్ యస్ సీటు ఇవ్వక తప్పలేదు . అయినప్పటికీ ఆర్జేసీ కేసీఆర్ మీద ఉన్న అభిమానంతో పార్టీలో ఎదో ఒక పదవి దక్కక పోతుందా ? అని పార్టీకోసం పని చేస్తున్నారు. ఒక సందర్భంలో నాడు ఎమ్మెల్యేగా ఉన్న అజయ్ టీఆర్ యస్ లో చేరినప్పడు ఆర్జేసీ కి అజయ్ కి తేడా ఉన్నా, తరవాత కాలంలో సర్దుకున్నాయి. అజయ్ ఫాలోవర్ గా మారాడు.రెండవసారి అజయ్ కు టికెట్ వచ్చింది. అజయ్ గెలుపులో ఆర్జేసీ కీలకంగానే వ్యవహరించారు . అజయ్ కూడా ఆర్జేసీని తన సొంత మనిషిలా చేశారు . ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరింది. అందువల్ల అజేయ అశీసులతో ఆర్జేసీకి అధ్యక్ష పదవి ఖాయం అని అందరు అనుకున్నారు . అది రాకపోయేసరికి ఆర్జేసీ మనస్తాపం చెందారు…పార్టీ కార్యాలయానికి వెళ్లడం మానేశారు . అజయ్ బుజ్గింపులు ఎంతవరకు పనిచేస్తాయో ఆయనకు పదవి వస్తుందో చూడాలి మరి ….

Related posts

భువనేశ్వరి మేనల్లుడిగా జూనియర్‌ ఎన్టీఆర్‌ విఫలం :వ‌ర్ల రామయ్య తీవ్ర వ్యాఖ్య‌లు!

Drukpadam

దీదీ కొత్త ఎత్తుగడ …టీఎంసీ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ గా ఎంపిక!

Drukpadam

పార్టీ పెట్టె ఆలోచన లేదు …సాగర్ లో పోటీచేయటం లేదు

Drukpadam

Leave a Comment