Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

నా ఆత్మ కథతో పుస్తకం రాస్తున్నా… త్వరలోనే వస్తుంది: మోహన్ బాబు

నా ఆత్మ కథతో పుస్తకం రాస్తున్నా… త్వరలోనే వస్తుంది: మోహన్ బాబు

  • సన్ ఆఫ్ ఇండియా’ చిత్రంలో నటించిన మోహన్ బాబు
  • డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో చిత్రం
  • ఈ నెల 18న విడుదల
  • మీడియాతో ముచ్చటించిన మోహన్ బాబు

టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. సినీ రచయిత డైమండ్ రత్నబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు మీడియాతో ముచ్చటించారు. తన జీవితకథతో పుస్తకం రాస్తున్నట్టు వెల్లడించారు. ఆ పుస్తకం త్వరలోనే విడుదల అవుతుందని చెప్పారు. అయితే బయోపిక్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు.

ఇక, ఏపీ మంత్రి పేర్ని నాని తన ఇంటికి రావడం రాజకీయపరమైన విమర్శలకు దారితీయడం పట్ల మోహన్ బాబు స్పందించారు. తన ఇంటికి గవర్నర్లు, సీఎంలు కూడా వస్తుంటారని, పేర్ని నాని కూడా ఓ గెస్టుగానే వచ్చారని, దాన్ని రాద్ధాంతం చేస్తే ఎలా? అని హితవు పలికారు. సీఎం జగన్ తో టాలీవుడ్ ప్రముఖుల చర్చలపై పేర్ని నానితో ఎలాంటి చర్చ జరగలేదని మోహన్ బాబు స్పష్టం చేశారు. “అల్పాహార విందుకు రావాలని పేర్ని నానిని ఆహ్వానించాం… వచ్చారు… ఆయనకు శాలువా కప్పి సన్మానించాం… అంతే” అంటూ వివరణ ఇచ్చారు.

Related posts

రాజమౌళిపై అమెరికా మీడియాలో కథనం!

Drukpadam

సీఎం సీఎం అని అరిస్తే సరిపోదు.. మీకు దమ్ముంటే.. : నాగబాబు అసహనం!

Drukpadam

టాలీవుడ్ లో మరో విషాదం …కైకాల ఇక లేరు …ప్రముఖుల సంతాపం …

Drukpadam

Leave a Comment