Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

ఇండస్ట్రీ బహిష్కరించినా బాధ లేదు: పోసాని సంచలన వ్యాఖ్యలు!

ఇండస్ట్రీ బహిష్కరించినా బాధ లేదు: పోసాని సంచలన వ్యాఖ్యలు!
-ఎలా బ్రతకాలో తెలియని వాళ్ళు పరుచూరి బ్రదర్స్
-పరుచూరి బ్రదర్స్ ,ఆత్రేయ లాంటి వారిని ఇండస్ట్రీ దూరం పెట్టింది
-సన్ ఆఫ్ ఇండియా సక్సెస్ కావాలి

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రచయితగా దర్శకుడిగా మంచి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న పోసాని కృష్ణ మురళి రాజకీయప్రస్థానం విచిత్రంగానే ఉంది . ముక్కుసూటిగా మాట్లాడటం వివాదాస్పద కావడం తెలిసిందే. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేసిన అనంతరం పోసాని కృష్ణమురళి చాలా సైలెంట్ అయిపోయాడు. రీసెంట్ గా సన్ ఆఫ్ ఇండియా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రత్యక్షమైయ్యాడు . ఈవెంట్ లో చేసిన కొన్ని వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

మోహన్ బాబు హీరోగా నటించిన సన్ ఆఫ్ ఇండియా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా పోసాని కృష్ణ మురళి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. మోహన్ బాబు అలాగే వారి పిల్లలు కూడా చాలా సామాన్యమైన వ్యక్తులు. నా మాదిరిగానే.. చాలా మందికి నేను తెలుసు గాని నేను ఏమిటో తెలియదు. ఆ విషయం గురించి చాలామందికి తెలియదు . నేను చదువు పూర్తి చేసిన తర్వాతనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను.. అని అన్నారు.

మొదట తాను అసిస్టెంట్ రైటర్ గా పరుచూరి బ్రదర్స్ దగ్గర వర్క్ చేశానని తెలిపారు . ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది తనకు పరిచయమయ్యారని పేర్కొన్నారు . మోహన్ బాబు గారు కూడా అప్పుడే తెలుసు అన్నారు . ఇక తెలుగు చిత్ర పరిశ్రమ గురించి ఏమిటో కూడా అప్పుడే చాలా బాగా తెలిసిందని అన్నారు . ఇండస్ట్రీలో తనను చాలా బాగా ఇష్టపడే వారిలో బి.గోపాల్ ఒకరని అన్నారు . ఆయన దగ్గర తాను అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పని చేశానని అన్నారు . అయితే ఆయన నా దగ్గర పని చెయ్ అని చెప్పినప్పుడు పరుచూరి వాళ్ళు ఒప్పుకొని విషయాన్నీ గుర్తు చేశారు .

పరుచూరి బ్రదర్స్ దగ్గర చాలా నేర్చుకున్నాను. ఐదేళ్ల సినీ ప్రయాణం తర్వాత వారి నుంచి మరొక ముఖ్యమైన విషయం కూడా తెలుసుకున్నాను.. పరుచూరి బ్రదర్స్ తరహాలో మాత్రం బ్రతకకూడదు అనుకుంటున్నా.. అలా మాత్రం బ్రతకడం లేదు…. నిజానికి వాళ్లకు ఎలా బ్రతకాలో కూడా తెలియదు. దాదాపు 20 ఏళ్ళ పాటు వాళ్ళు అద్భుతమైన సినిమాలకు వర్క్ చేశారు. అలాంటి వారిని అలాగే ఆత్రేయ వంటి గొప్ప వారిని ఇండస్ట్రీ ఎంత దూరం పెట్టిందో తెలుసు.. అని అన్నారు.

పరుచూరి బ్రదర్స్ వేటూరి శ్రీశ్రీ ఇలా చాలా మందిని చూసి వీరి లాగా బ్రతక కూడదు అని ఒక నిర్ణయానికి వచ్చాను. ఒకవేళ అలా బ్రతికితే జీవితాంతం బ్రతకలేను. కుక్క చావు చేస్తాను అని అర్థమయింది. చస్తే పదిమంది రావాలి. ఇక్కడ చావు కూడా చాలా ఖరీదుగా ఉంటుంది. పెదరికం చావు పది మందిని కూడా రానివ్వదు. కానీ డబ్బున్న చావు మాత్రం పదివేల మందిని తీసుకు వస్తుంది. వీటి మధ్య ఉండడం నాకు ఇష్టం లేదని కొన్నాళ్ళు నా కుటుంబంతో కాస్త దూరంగా బ్రతుకుతున్నాను. అని అన్నారు.

అయితే రేపు పొద్దున సినిమా పరిశ్రమ పోసాని కృష్ణమురళి బహిష్కరించిన కూడా అంతవరకు నేను సంపాదించుకుంటూ కూర్చుంటాను. నేను తెలుగు చిత్రపరిశ్రమలోనే బ్రతుకుతున్నాను. సినిమానే నమ్ముకున్నాను ఇక్కడ ఎవరి దగ్గర మందు పోసుకుంటూ చెంచా గా పని చేయాల్సిన అవసరం లేదు. ఆ బ్రతుకు నాకు వద్దు కూడా. ఇండస్ట్రీలో నేను చాలా చూశాను ఇండస్ట్రీ నాకు అన్నీ ఇచ్చింది. ఈ తరుణంలో నాకు ఏది వచ్చినా కూడా బోనస్ అనే చెప్పాలి… అంటూ పోసాని కృష్ణమురళి సన్ ఆఫ్ ఇండియా సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు .

 

Related posts

టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూత

Ram Narayana

ఏపీ లో సినిమా టికెట్స్ ధరల వివాదం లో మంత్రి పేర్ని నాని ,ఆర్జీవీ మధ్య ప్రకటనల వార్!

Drukpadam

రిపబ్లిక్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ను పవన్ కళ్యాణ్ మిస్ లీడ్ చేశాడా ?

Drukpadam

Leave a Comment