Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీ సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆకస్మిక బదిలీ!

ఏపీ సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆకస్మిక బదిలీ!
-ఢిల్లీ లో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా నియామకం
-ఆయన భార్య భావన సక్సేనా కేంద్ర సర్వీసుల్లోకి
-ఇప్పటివరకు ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా భాద్యతలు
-ఆమె స్థానంలో ప్రవీణ్ ప్రకాష్ 

ఏపీ సీఎంఓ లో అత్యంత ముఖ్యుడుగా ,సీఎం కు పొలిటికల్ కార్యదర్శిగా పనిచేసిన ప్రవీణ్ ప్రకాష్ ఆకస్మికంగా బదిలీ కావడం ఆశక్తిగా మారింది. అయితే ఆయన సతీమణి భావన సక్సేనా ఐపీఎస్ ఇప్పటివరకు ఢిల్లీ లోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా పని చేశారు . ఆమె కేంద్ర సర్వీస్ లోకి వెళ్లడంతో అక్కడ పోస్ట్ ఖాళీ అయింది . దానితో తన భార్య ఢిల్లీలో ఉండటం ఆయన ఏపీలో ఉడటంతో కొంత ఇబ్బందిగా మారింది. దీంతో ఆయన కోరిక మేరకే సీఎం ఆయన్ను రిలీవ్ చేశారని ప్రచారం జరుగుతుంది . మరో పక్క ఎప్పటినుంచో ప్రవీణ్ ప్రకాష్ ను సీఎం ఓ నుంచి తప్పించాలని చేస్తున్నారని అందువల్లనే ఆయన్ను ఢిల్లీలో రెసిడెంట్ కమిషనర్ గా నియమించారని ప్రచారం జరుగుతుంది. ఏపీ లో సీఎంఓ ని ప్రక్షాళన చేసే దిశగా సీఎం జగన్ ఉన్నారని అందువల్లనే ప్రవీణ్ ప్రకాష్ పై వేటు పడిందని వాదనలు ఉన్నాయి. రేపు ఉగాది నాటికీ కొత్త జిల్లాల ఏర్పాటుతో పెద్ద ఎత్తునే ఐఏఎస్ , ఐపీఎస్ ల బదిలీలు ఉంటాయని అంటున్నారు .

Related posts

రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ…

Drukpadam

ముఖ్యమంత్రి జగన్ ప్రయాణించాల్సిన హెలికాప్టర్ లో సాంకేతిక లోపం!

Drukpadam

పార్లమెంటు భవనం డిజైన్ శవపేటికలా ఉందన్న ఆర్జేడీ.. తీవ్రంగా స్పందించిన బీజేపీ

Drukpadam

Leave a Comment