Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీ డీజీపీ సవాంగ్ బదిలీ.. కొత్త డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి నియామకం!

ఏపీ డీజీపీ సవాంగ్ బదిలీ.. కొత్త డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి నియామకం!

  • రాష్ట్ర పోలీసు శాఖలో కీలక మార్పులు
  • సవాంగ్ ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ
  • జీఏడీలో రిపోర్ట్ చేయాలంటూ సవాంగ్ కు ఆదేశం

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీవేటు పడింది . ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నిమించడంపై సర్వత్రా ఆశక్తి నెలకొన్నది . ఉద్యోగులు ఇటీవల నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైన సంగతి తెలిసిందే. లక్షలాది మంది ఉద్యోగులు విజయవాడకు చేరుకుని తమ బలాన్ని ప్రదర్శించారు. పోలీసుల వైఫల్యమే దీనికి కారణమని ప్రభుత్వం భావిస్తోంది. భారీగా తరలి వచ్చిన ఉద్యోగులను నిలువరించడంలో ప్రభుత్వం విఫలమయిందని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే డీజీపీ సవాంగ్ ను బదిలీ చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం. గౌతమ్ సవాంగ్ సీఎం జగన్ కు నమ్మకమైన అధికారిగా పనిచేశారని పేరున్నప్పటికీ ఒక్క విజయవాడ ర్యాలీ తోనే బదిలీ చేశారా ? లేక మరేమైనా కారణాలు ఉన్నాయా ? అనే చర్చకు ఆస్కారం ఏర్పడింది .

 

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఇంటెలిజెన్స్ డీజీపీ బాధ్యతలు కూడా ప్రస్తుతానికి రాజేంద్రనాథ్ రెడ్డి వద్దే ఉన్నాయి. మరోవైపు, గౌతమ్ సవాంగ్ ను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను వెలువరించింది.

గతంలో విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గా రాజేంద్రనాథ్ రెడ్డి పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ ఈస్ట్ డీసీపీగా పని చేశారు. సీనియారిటీలో ద్వారకా తిరుమలరావు ముందున్నప్పటికీ రాజేంద్రనాథ్ ను డీజీపీగా నియమించడం గమనార్హం. రాజేంద్రనాథ్ 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. గౌతమ్ సవాంగ్ కు ప్రభుత్వం ఇంతవరకు కొత్త పోస్టింగ్ ఇవ్వలేదు.

Related posts

గుంటూరు జైలు నుంచి రఘురామకృష్ణరాజును సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించిన సీఐడీ

Drukpadam

కాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టమే: గులాం నబీ అజాద్

Drukpadam

సీఎం జగన్ అపాయింట్ మెంట్ దొరక్కపోవడంతో బ్లేడుతో మణికట్టు కోసుకున్న మహిళ!

Drukpadam

Leave a Comment