Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

భీమ్లానాయక్ సినిమా టికెట్లు అధిక ధరకు విక్రయం.. గుడివాడ థియేటర్‌కు జరిమానా!

భీమ్లానాయక్ సినిమా టికెట్లు అధిక ధరకు విక్రయం.. గుడివాడ థియేటర్‌కు జరిమానా!

  • గుడివాడలోని జీ3 భాస్కర్ థియేటర్‌లో టికెట్ల ధర పెంపు
  • టికెట్లపై ధర ముద్రించని వైనం
  • ప్రేక్షకుల నుంచి ఫిర్యాదులు అందడంతో విచారణ 
  • రూ. 50 వేల జరిమానా విధించిన వైనం

పవన్ కల్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా టికెట్లను అధిక ధరకు విక్రయించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణా జిల్లా గుడివాడలోని ఓ థియేటర్‌పై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. స్థానిక జీ3 భాస్కర్ థియేటర్‌లో భీమ్లానాయక్ సినిమా టికెట్లను అధిక ధరకు విక్రయిస్తున్నట్టు ప్రేక్షకుల నుంచి ఫిర్యాదులు అందడంతో గుడివాడ ఆర్ఐ జాస్తి అరవింద్ థియేటర్‌లో తనిఖీలు నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాధవీలతకు నివేదికను పంపారు.

డైమండ్ కేటగిరీ టికెట్ ధర రూ. 70 అయితే దానిని రూ. 100కు విక్రయిస్తున్నారని, అలాగే, పలు టికెట్లపై ధరలను ముద్రించలేదని ఆర్ఐ తెలిపారు. ఆర్ఐ అరవింద్ పంపిన నివేదికను పరిశీలించిన జేసీ మాధవీలత థియేటర్ యాజమాన్యానికి రూ. 50 వేల జరిమానా విధించారు. ఈ థియేటర్‌ను మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని శుక్రవారమే ప్రారంభించడం గమనార్హం.

Related posts

సీనియర్ నటుడు కృష్ణంరాజు కన్నుమూత…తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం…!

Drukpadam

ఓ తల దూసుకొచ్చి నా ఛాతిని తాకింది: ఒడిశా భయానక దృశ్యాన్ని వెల్లడించిన యువకుడు

Drukpadam

చంద్రబాబుకు భారీ ఊరట.. అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్ మంజూరు

Ram Narayana

Leave a Comment