Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ …సీఎల్పీ నేత భట్టి!

తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ …సీఎల్పీ నేత భట్టి!
ఉద్యమ పార్టీని కుటంబ పార్టీగా మార్చిన ఘనుడు కేసీఆర్
మూడవ రోజు పీపుల్స్ మార్చ్… ప్రజలనుంచి స్పందన
ప్రాజెక్టుల నిర్మాణాల పేరుతొ లక్షల కోట్ల దోపిడీ
కేసీఆర్ పాలనలో పేదల కోసం ఒక్క పథకమైనా తెచ్చారా?
ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమల్లో కేసీఆర్ వైఫల్యం

 

తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాగా తమఘనతగా చెప్పుకున్న టీఆర్ యస్, చివరకు ఉద్యమ పార్టీని కుటుంబపార్టీగా మార్చిన ఘనుడు కేసీఆర్ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విధానాలపై ధ్వజమెత్తారు . కాంగ్రెస్ హయాంలో ప్రారంబైన ప్రాజెక్టులను సైతం టీఆర్ యస్ ఖాతాలో వేసుకొని ప్రచారం చేసుకోవడం ఆయనకే చెల్లిందని విమర్శలు గుప్పించారు .

 

 

 

తన సొంత నియోజకవర్గ మైన మధిరలో పీపుల్స్ మార్చ్ లో భాగంగా మూడవరోజు ముదిగొండ మండలంలో వివిధ గ్రామాలలో ప్రజలను పలకరించారు. వారి సమస్యలను సావధానంగా విన్నారు . ఆయా గ్రామాలలో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొని టీఆర్ యస్ విధానాలను తూర్పార బట్టారు. ఉద్యమ పార్టీని కుటుంబ పార్టీ గా మార్చి తెలంగాణా ద్రోహులకు పదవులు కట్టబెట్టి ,నిజమైన ఉద్యమకారులను విస్మరించిన చరిత్రకారుడుగా కేసీఆర్ నిలిచారని దుయ్యబట్టారు . బంగారు తెలంగాణ అని ప్రజలకు కుచ్చుటోపీ పెట్టారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజా సమస్యలను పట్టించుకోకుండా మాయమాటలు చెపితే వినే పరిస్థితిలో ప్రజలు లేరని గుర్తుంచుకోవాలని భట్టి ఘాటు హెచ్చరికలు చేశారు .

 

 

రైతుబంధు పేరుతో రైతులను టిఆర్ఎస్ సర్కార్ దగా చేస్తున్నదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. రైతుబంధు ఇస్తున్నామని గొప్పలు చెబుతూ వ్యవసాయానికి ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహకాలు నిలిపివేశారని విమర్శించారు . పంట నష్టపోయిన రైతులకు 8 ఏళ్లుగా ఒక ఎకరానికి కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లకు, ట్రాక్టర్ల కొనుగోలు పై ఇచ్చే సబ్సిడీ కేసీఆర్ ప్రభుత్వం నిలిపివేసింది దుయ్యబట్టారు . రైతుబంధు ఇచ్చి ఎరువుల ధరలు పెంచితే రైతులకు కలిగే ప్రయోజనం ఏంటని కెసిఆర్ ను ప్రశ్నించారు. ఎకరానికి పెట్టుబడి సాయంగా పది వేలు ఇచ్చి రైతుల పై రూ.30 వేల భారం వేస్తున్నది వాస్తవమా? కాదా? దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు.

 

భట్టి వెంట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ ,పోట్ల నాగేశ్వర రావు , రాయల నాగేశ్వర రావు , మండల నాయకులూ , పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు .

 

 

Related posts

బద్వేల్ బరిలో జనసేన …..

Drukpadam

హుజూరాబాద్‌లోనే కాదు.. యూపీలోనూ బీజేపీకి ఓటమి తప్పదు: అసదుద్దీన్ ఒవైసీ…

Drukpadam

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కుదుపు …

Drukpadam

Leave a Comment