Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ను ఉరితీసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు :భట్టి

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ను ఉరితీసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు :భట్టి
-భట్టి పాదయాత్రకు పీసీసీ నేతలు సంఘీభావం
-రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ
-భట్టి ప్రసంగాలు శ్రద్దగా వింటున్న రైతులు
-రైతు బందు పై భట్టి వివరణ ఆలోచింప జేస్తున్న వైనం
-వివిధ పార్టీల సంఘీభావం

 

సీఎల్పీ నేత ,మధిర శాసన సభ్యులు భట్టి విక్రమార్క నిర్వహిస్తున్న పీపుల్స్ మార్చ్ కు రోజు రోజు కు ఆదరణ పెరుగుతుంది . శుక్రవారం ముదిగొండ మండలం లో నిర్వహించిన పాదయాత్రలో ఆయన ప్రసంగాలు ఆకట్టు కున్నాయి.

 

 

మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ను ఉరితీసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని తీవ్ర స్వరం తో ధ్వజమెత్తారు . ఒక పథకం ప్రకటించడం అది ప్రారంభం కాకుండానే పాలాభిషేకాలు చేయించుకోవడం ఆనవాయితీగా మారిందని ,ఇప్పడు ఆయన మోసాలను గ్రహించిన ప్రజలు ఆయన్ను శాస్వితంగా ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు . రైతులకు సబ్సిడీలు కట్ చేసి నందుకు పాలాభిషేకమా ? పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చినందుకా ?దేనికి చెయ్యాలి పాలాభిషేకం అంటూ కేసీఆర్ పాలపై నిప్పులు చెరిగారు .

 

 

టిఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముదిగొండ మండలం వల్లభి గ్రామాంలో శుక్రవారం నిర్వహించిన పాదయాత్రలో పీసీసీ నేతలు పాల్గొని సంఘీభావం తెలిపారు. మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్, పిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ శాసనసభ్యులు వేం నరేందర్ రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్, కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి, మహబూబాద్ డిసిసి అధ్యక్షులు భరత్ చంద్ర రెడ్డి లు పాదయాత్రకు సంఘీభావం ప్రకటించి పీపుల్స్ మార్చ్ నిర్వహిస్తున్న విక్రమార్కుడి అడుగులో అడుగులు వేస్తూ కదం తొక్కారు.

స్థానిక సిపిఎం, టిడిపి, ఎంఆర్పిఎస్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పూలమాలవేసి సి ఎల్ పి నేతను సత్కరించారు. అనంతరం గ్రామంలో జరిగిన పాదయాత్రలో విక్రమార్క తో కలిసి అడుగులో.. అడుగులు వేసి కదం తొక్కారు.

Related posts

చీరాల వైసీపీ ఎమ్మెల్యే కరుణం వర్సెస్ ఆమంచి వర్గాల ఘర్షణ!

Drukpadam

రాజకీయ నాయకుడినే.. కానీ నేనూ మనిషినే: సచిన్ పైలట్

Drukpadam

లోక్ సభలో విపక్షాలపై ప్రధాని మోదీ సెటైర్లు..!

Drukpadam

Leave a Comment