Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రీడా వార్తలు

పింక్ బాల్ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ లో భారత్ జయభేరి …

పింక్ బాల్ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ లో భారత్ జయభేరి …
శ్రీలంకపై సిరీస్ క్లీన్ స్వీప్..రెండున్నర రోజుల్లోనే ఫలితం
బెంగళూరులో డే నైట్ టెస్టు
పింక్ బాల్ తో ఆడిన టీమిండియా, శ్రీలంక
447 పరుగుల లక్ష్యం
208 పరుగులకు ఆలౌట్ అయినా శ్రీలంక
శ్రీలంక సారధి శతకం వృధా ?

రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. పింక్ బాల్ తో ఆడిన డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఆటగాళ్లు అన్నిరంగాలలో అద్భుత ప్రదర్శన కనబరిచారు . శ్రీలంకతో బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం రెండున్నర రోజుల్లోనే ముగిసిన ఈ డే నైట్ టెస్టులో భారత్ అన్ని రంగాల్లో సత్తా చాటింది. 238 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది. 447 పరుగుల విజయలక్ష్యంతో మూడో రోజు ఆట కొనసాగించిన శ్రీలంక 208 పరుగులకు ఆలౌట్ అయింది. లంక సారథి దిముత్ కరుణరత్నే (107) సెంచరీ కొట్టినా ప్రయోజనం దక్కలేదు.

ఓవర్ నైట్ స్కోరు 28/1తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన లంక ఓ దశలో సజావుగానే ఆడుతున్నట్టు కనిపించింది. అయితే, 54 పరుగులు చేసిన కుశాల్ మెండిస్ ను అశ్విన్ అవుట్ చేయడంతో లంక పతనం షురూ అయింది. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ ఎవరూ క్రీజులో కుదురుకోకపోవడంతో భారీ ఓటమి తప్పలేదు.

ఓవైపు వికెట్లు పడుతున్నా ఓపిగ్గా ఆడిన కరుణరత్నే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే అతడిని బుమ్రా బౌల్డ్ చేయగా, ఆ తర్వాత కొద్దిసేపటికే లంక ఇన్నింగ్స్ కు అశ్విన్ తెరదించాడు. అశ్విన్ 4 వికెట్లు తీయగా, బుమ్రా 3, అక్షర్ పటేల్ 2, జడేజా 1 వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్ ను టీమిండియా 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. రోహిత్ నాయకత్వంలో టీం ఇండియా అటు టి 20 లోను ,వన్ డే లోను టెస్ట్ ల్లోనూ క్లిన్ స్వీప్ సాధించడం విశేషం ….

Related posts

వెస్టిండీస్ పై మూడో వన్డేలోనూ టీమిండియా విజయం… సిరీస్ క్లీన్ స్వీప్

Drukpadam

ప్రపంచ క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయం నమోదు చేసిన భారత్ !

Drukpadam

ఐపీఎల్ మిగిలిన మ్యాచ్ లు యూఏఈలో!

Drukpadam

Leave a Comment