Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పెట్టు బడుల కోసం కేటీఆర్ అమెరికా యాత్ర ….

 

 

పెట్టు బడుల కోసం కేటీఆర్ అమెరికా యాత్ర ….
-10 రోజులు అమెరికా పర్యటించనున్న కేటీఆర్ బృందం
-వివిధ రాష్ట్రాల సందర్శన
-వారితో గెట్ టు గెదర్ లు

-శంషాబాద్ నుంచి బ‌య‌లుదేరిన కేటీఆర్‌
-లాస్ ఏంజెలెస్ నుంచి మొద‌లుకానున్న టూర్‌
-ఐటీ, పారిశ్రామిక పెట్టుబడుల సాధ‌నే లక్ష్యం

రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పెట్టు బడులను ఆకర్షించేందుకు అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు .అమెరికా వెళ్లేందుకు శంషాబాద్‌ ఎయిర్ పోర్టుకు చేరుకుని, విమానం ఎక్కి చిద్విలాసంగా కూర్చుని ఉన్న కేటీఆర్‌ ఫొటోల‌ను ఆయ‌న మిత్ర బృందం విడుద‌ల చేసింది.  రాష్ట్రానికి ఐటీ, పారిశ్రామిక పెట్టుబడులను సాధించేందుకు 10 రోజుల పాటు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలకు గల అవకాశాలను అక్కడ ఉన్నవారికి చెప్పటం ద్వారా రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్ లో ఉన్న సౌకర్యాలను తెలియచెప్పనున్నారు . ఇక్కడ కు వచ్చేందుకు ఆంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ఉండటం తో పాటు పలు ఆంతర్జాతీయ పరిశ్రమలు ముందుకు వస్తున్నా విషయాన్నీ వారికీ వివరించేందుకు కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి ఈ పర్యటన చేస్తున్నారు .

ఈ నెల 29 వరకు వీరు అమెరికాలోని తూర్పు, పశ్చిమ కోస్తా ప్రాంతాల్లో పర్యటిస్తారు. కేటీఆర్ వెంట వెళ్తున్న వారిలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్, ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ సుజయ్ కారంపూరి ఉన్నారు. లాస్ ఏంజెలెస్ నుంచి వీరి పర్యటన మొదలు కానుండ‌గా.. శాండియాగో, శాన్ జోస్, బోస్టన్, న్యూయార్క్ లలో టూర్‌ కొనసాగుతుంది.

Related posts

హైదరాబాదులో 45 రోజుల పాటు అతిపెద్ద పారిశ్రామిక ఎగ్జిబిషన్!

Drukpadam

సొంత నిధులతో వకుళమాత ఆలయాన్ని నిర్మించిన మంత్రి పెద్దిరెడ్డి…

Drukpadam

ఏపీ డీజీపీ విచార‌ణ‌కు హాజ‌రుకావాలంటూ ఏపీ హైకోర్టు ఆదేశం!

Drukpadam

Leave a Comment