Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

షర్మిల ఖమ్మం సభ ఓకే … బట్ కండీషన్స్ అప్లై పోలిసుల మెలిక

షర్మిల ఖమ్మం సభ ఓకే … బట్ కండీషన్స్ అప్లై …పోలిసుల మెలిక
-6 వేలమందితోనే సభ జరుపుకోవాలని షరతు
-సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల లోపు సభ ముగించాలి
-మాస్క్ లు , శానిటైజర్ తప్పని సరి
-కావాలనే షరతులు పెట్టరంటున్న షర్మిల అభిమానులు
-అదేంలేదు కరోనా కేసులు పెరుగుతున్నాయన్న పోలీసులు
షర్మిల ఖమ్మం లో ఏప్రిల్ 9 న నిర్వహించతలపెట్టిన బహిరంగ సభకు పోలీసులు అనుమతులు ఇచ్చినట్లే ఇచ్చి తరువాత మెలిక పెట్టారు . సభ ఓకే … బట్ కండీషన్స్ అప్లై … అంటూ పోలిసుల మెలిక పెట్టారు. సభకు పోలిసుల నుంచి అనుమతి రావటంతో ఆనందముతో ఉన్న వైయస్ అభిమానులకు పోలిసుల షరతులు తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఇదిమిటి పర్మిషన్ ఇచ్చి షరతులు ఏమిటి అంటే కరోనా రోజురోజుకు పెరుగుతుంది .అందువల్ల పబ్లిక్ గ్యాదరింగులను సాధ్యమైనంత తగ్గించాలనే ఆదేశాలు పైనుంచే ఉన్నాయని అందువల్ల తాము ఇమి చేయలేమని చేతులెత్తేశారు.మీకు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం సభ జరుపుకోవాల్సిందే లేకపోతె మీఇష్టం అంటున్నారు. సభకు లక్షమందిని సమీకరించి తమ సత్తా చాటాలని షర్మిల భావించారు. ఖమ్మం సభద్వారా ఒక సందేశం ఇవ్వాలనుకున్నారు. ఇక్కడే పార్టీ పేరు జెండా , ఎజెండాలను ఘనంగా ప్రకటించాలని భావించారు. కానీ అందుకు విరుద్ధంగా పోలిసుల షరతులు ఉండటంతో ఆలోచనలో పడ్డారు. షర్మిల పార్టీ పెట్టాలనే తన ఆలోచనను ప్రకటించినతరువాత మొదటి సరిగా హైద్రాబాద్ నుంచి బహిరంగ కారక్రమంలో పాల్గొనేందుకు వస్తునందున పెద్ద కాన్యాయ్ తో ఖమ్మం రావాలని ప్లాన్ రూపొందించుకున్నారు. పోలీసులు మాత్రం బహిరంగ సభకు 6 వేలమందికి మించకూడని అంటున్నారు. షర్మిల బయటకు వస్తున్నారంటేనే వేలమంది వస్తారు .వారిని కంట్రోల్ చేయటం పెద్ద కష్టమైన పనే అవుతుంది. పోలిసుల షరతులతో శానిటైజర్ , మాస్క్ లు కూడా కంపల్సరీ చేశారు. ఇప్పటికే దీనిపై పెద్ద వెత్తున ప్రచారం జరుగుతున్నందున వాటికీ పెద్ద అభ్యంతరం లేకపోయినా సభకు వచ్చే ప్రజలను కంట్రోల్ చేయటం సాధ్యం అవుతుందా అనేది ఇక్కడ ప్రశ్న ? పోలీస్ ఇచ్చిన పర్మిషన్ ప్రకారం కేవలం 6 వేల మంది తో మాత్రమే సభ జరుపుతారా? లేక సభను వాయిదా వేసుకుంటారా ? అనేది ఇప్పడు చర్చనీయాంశం అయింది.
షర్మిల పాలేరు నుంచి పోటీ చేస్తారనే మాట వాస్తవం కాదా?
షర్మిల ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచి పోటీచేస్తారని వస్తున్నా వార్తలు వాస్తవం కాదని షర్మిల ముఖ్య అనుచరుడు కొండా రాఘవరెడ్డి స్పష్టం చేశారు. షర్మిల ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి పోటీచేస్తారని వస్తున్నా వార్తలపై ఆయన స్పందించారు. ఈ వార్తలు ఎక్కడ్నుంచి వస్తున్నాయో తమకు అర్థం కావడంలేదన్నారు.అసలు ఇంకా పార్టీ పెట్టలేదు.జెండా ,ఎజెండా ప్రకటించలేదు. ఆమె అక్కడ నుంచి పోటీచేస్తారని ఇక్కడ నుంచి పోటీచేస్తారని ప్రచారం చేయటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అక్కడ నుంచి పోటీచేస్తారనే ఆలోచన ఇప్పుడే చేయటం తొందరపాటే అవుతుందని ఆయన పేర్కొన్నారు. తాము ఏమి చేసిన మీడియా కు చెప్పి చేస్తామన్నారు. అంతవరకూ ఓపిక పట్టాలని విజ్ఞప్తి చేశారు.

Related posts

ఎన్ హెచ్ఆర్ సీ చైర్మన్ పీసీ పంత్ ను కలిసిన రఘురామకృష్ణరాజు…

Drukpadam

కోయంబత్తూరులో కమల్ హాసన్ ముందంజ…

Drukpadam

‘ఆటో’ చుట్టూ తిరుగుతున్న కర్ణాటక రాజకీయాలు!

Drukpadam

Leave a Comment