Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ధాన్యం కొనుగోళ్ల‌పై రాజ‌కీయ ర‌చ్చ‌…

ధాన్యం కొనుగోళ్ల‌పై రాజ‌కీయ ర‌చ్చ‌…పంజాబ్ లాగా తెలంగాణ ధాన్యం కొనాల్సిందే :కేసీఆర్!
-ధాన్యం కొనుగోళ్ల‌కు కేసీఆర్ స‌ర్కారు స‌హ‌క‌రించ‌ట్లేదు: కేంద్ర మంత్రి గోయ‌ల్‌
-తెలంగాణ నుంచి రా రైస్ కొంటామ‌న్న గోయ‌ల్‌
-కేసీఆర్ స‌ర్కారు ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తోంద‌ని ఆరోప‌ణ‌
-కేంద్రం మాటల్లో ఏమాత్రం నిజం లేదన్న కేసీఆర్
-రేపు మా మంత్రులు కేంద్ర మంత్రిని కలుస్తారని వెల్లడి
-అప్పటికి కేంద్రం నుంచి సానుకూలత రాకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరిక

 

 

తెలంగాణ‌లో ఇప్పుడు యాసంగి ధాన్యం కొనుగోళ్ల‌కు సంబంధించిన వ్య‌వ‌హారంపై రాజ‌కీయ ర‌చ్చ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌లో పండే మొత్తం ధాన్యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం కొనుగోలు చేయాల్సిందేన‌ని సీఎం కేసీఆర్ ప‌ట్టుబడుతున్నారు. ఈ దిశ‌గా ఆయ‌న త‌న పార్టీ నేత‌ల‌తో కీల‌క స‌మావేశం నిర్వహించారు . అనంతరం హైద్రాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేంద్రం విధానాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు . ఈ నేప‌థ్యంలో అటు ఢిల్లీలోనూ బీజేపీ తెలంగాణ నేత‌లు త‌మదైన శైలి విమ‌ర్శ‌లు సంధిస్తున్నారు.

సోమ‌వారం పార్ల‌మెంటులో కేంద్ర వాణిజ్య శాఖ‌ మంత్రి పీయూష్ గోయ‌ల్‌ను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజ‌య్ క‌లిశారు. బీజేపీ ఎంపీలు ధ‌ర్మ‌పురి అర‌వింద్‌, సోయం బాపూరావుల‌తో క‌లిసి కేంద్ర మంత్రిని క‌లిసిన బండి.. తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల‌పైనే చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా స్పందించిన గోయ‌ల్‌.. యాసంగి సీజన్ లో కచ్చితంగా తెలంగాణ నుండి రా రైస్ కొనుగోలు చేస్తామని ప్రకటించారు. రైతులను ఆదుకోవడం తమ కనీస బాధ్యతని ఆయ‌న‌ చెప్పారు. దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వమే ఈ విషయంలో కేంద్రానికి సహకరించకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆయ‌న ఆరోపించారు.

దీనిపై కేసీఆర్ స్పందించారు . కేంద్రం మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలనీ డిమాండ్ చేశారు . పంజాబ్ ,హర్యానా రాష్ట్రాలలో రైతులు పండించిన ధాన్యం అంతా కొనుగోలు చేస్తూ . తెలంగాణ ధాన్యం ఎందుకు కొనుగోలు చేయదని ప్రశ్నించారు . మేము పండించిన బియ్యం కాదు వడ్లు కొనాల్సిందే లేకపోతె ఎందుకు కొనరో తెలుసుకుంటాం అని అన్నారు .

Related posts

చంద్రబాబును దీవించాలంటూ నోరు జారిన తెలంగాణ మంత్రి!

Drukpadam

పవన్ కళ్యాణ్ , లోకేష్ చర్యలపై మంత్రులు బొత్స , అనికుమార్ లు మండిపాటు!

Drukpadam

టీటీడీ అంటే క్విడ్ ప్రోకో డబ్బుతో పెట్టుకున్న సూట్ కేస్ కంపెనీ కాదు:లోకేశ్ 

Drukpadam

Leave a Comment