Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాజకీయాలకు ఆజాద్ గుడ్‌బై? రాష్ట్రపతిగా రానున్నారా ?

రాజకీయాలకు ఆజాద్ గుడ్‌బై? రాష్ట్రపతిగా రానున్నారా ?
-సమాజంలో రాజకీయ పార్టీలు మార్పు తీసుకురాకపోతే సామాజిక సేవా సంస్థలే బాధ్యత తీసుకోవాలి
-నేను ఆ దిశగా అడుగులేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు
-సన్మాన సభలో ఆజాద్ వ్యాఖ్యలు

కాంగ్రెస్ సీనియర్ నేత ,కాంగ్రెస్ లో అసమ్మతివాదిగా ముద్రపడిన గులాంనబీ ఆజాద్ రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా ? అంటే అవుననే అంటున్నారు రాజకీయపరిశీలకులు . అయితే ఆయన్ను బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీకి పెడుతుందా ? అనే చర్చకూడ కూడా జరుగుతుంది. నిజంగా బీజేపీ కాంగ్రెస్ నుంచి తీసుకోని ఆజాద్ ను రాష్ట్రపతిని చేస్తుందా అంటే సందేహమే నంటున్నారు . పరిశీలకులు . అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే నంటున్నారు కొందరు పండితులు …

కాంగ్రెస్ అధికారంలో ఉండగా చక్రంతిప్పిన ఆజాద్ గత కొంత కాలంగా ఏ పదవి లేకుండా ఉంటున్నారు . రాజ్యసభలో కాంగ్రెస్ ,పక్ష నాయకుడిగా , ప్రతిపక్షనేతగా అంతకు ముందు కాంగ్రెస్ నుంచి కేంద్ర మంత్రిగా , జమ్మూ కాశ్మిర్ ముఖ్యమంత్రిగా ఆయన అనేక పదవులు అనుభవించారు . కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తరువాత చాలామంది కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లి పోయారు . కొందరు అసమ్మతి వదులుగా ఉండిపోయారు . కొందరు బీజేపీకి దగ్గరగా ఉన్నారనే విమర్శలు కూడా ఉన్నాయి.

రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూనే అసమ్మతివాదుల శిబిరానికి ఆజాద్ నాయకత్వం వహించారని ప్రచారం ఉంది. అధికార పార్టీకి ,ప్రత్యేకించి ప్రధాని మోడీకి ఆజాద్ సన్నిహితంగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి . అందుకు తగ్గట్లుగా ఆజాద్ రిటైర్ అవుతున్న సందర్భంగా జరిగిన సభలో ప్రధాని ఆజాద్ ని ప్రశంశలతో ముంచెత్తి కన్నీరు పెట్టారు . కొందరు ఎన్డీయే మంత్రులు ఆజాద్ మళ్ళీ సభకు రావలసిన అవసరం ఉందని అన్నారు . అప్పటినుంచి ఆజాద్ లో స్పష్టమైన మార్పు కనిపిస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి. నాటినుంచే రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆజాద్ నిర్ణయించుకున్నట్లు ఉన్నారు .

ఇటీవల జమ్మూ కాశ్మిర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు ఊతమిస్తున్నాయి. ఆజాద్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారా? అనే అభిప్రాయాలకు బలం చేకూర్చాయి. ఆజాద్‌కు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో కశ్మీర్‌కు చెందిన ఓ సంస్థ ఆయనను సన్మానించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల నుంచి తప్పుకుని సామాజిక సేవా కార్యక్రమాల దిశగా అడుగులు వేయనున్నట్టు సంకేతాలిచ్చారు.

సమాజంలో మార్పు తీసుకురావడంలో రాజకీయ పార్టీలు విఫలమైనప్పుడు సామాజిక సంస్థలే ఆ బాధ్యత తీసుకోవాలన్నారు. ఇందుకోసం తాను రాజకీయాల నుంచి తప్పుకుని సామాజిక సేవా కార్యక్రమాలు ప్రారంభించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటూ, ప్రస్తుతం తనలో అదే ఆలోచన ఉన్నట్టు చెప్పకనే చెప్పారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత ఆజాద్ త్వరలోనే రాజకీయాలకు గుడ్‌బై చెబుతారన్న ప్రచారం జోరందుకుంది.

Related posts

భట్టి విక్రమార్కకు కీలక ‘టాస్క్’ ఇచ్చిన రాహుల్ గాంధీ..!

Drukpadam

వ్యాక్సిన్ల కోసం రాష్ట్రాలు కొట్టుకునే దారుణ పరిస్థితులు తలెత్తాయి: కేజ్రీవాల్…

Drukpadam

పవన్ రాజకీయాలకు మాజీ భార్య రేణు దేశాయ్ మద్దతు…!

Ram Narayana

Leave a Comment