తాము బీజేపీ లో చేరబోము …కాంగ్రెస్ లో మా ప్రయాణం:కొండా సురేఖ
-పార్టీ మారే విషయంపై కొండా సురేఖ క్లారిటీ
-కాంగ్రెస్‌లోనే ఉంటామన్న సురేఖ
-పార్టీ మారే ప్రసక్తే లేదని వెల్లడి
-ఈ ప్రచారం గిట్టనివారు చేస్తున్నదేనన్న మాజీ మంత్రి
వరంగల్ జిల్లాకు చెందిన తాము మరోమారు పార్టీ మారుతున్నారంటూ ఇటీవల జరుగుతున్న ప్రచారంపై శనివారం నాడు కొండా సురేఖ క్లారిటీ ఇచ్చారు. తామంటే గిట్టనివారు తాము పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని అన్నారు . బీజేపీ లో చేరే ప్రశ్న లేదని కాంగ్రెస్ తోనే తమ ప్రయాణమని స్పష్టం చేశారు . తాము పార్టీ మారడం లేదని, కాంగ్రెస్ పార్టీలోనే తమ కుటుంబం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. శనివారం నాడు కొండా దంపతుల కుమార్తె జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగానే సురేఖ పార్టీ మారుతున్నట్లుగా తమపై జరుగుతున్న ప్రచారంపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని స్పష్టం చేసిన కొండా సురేఖ.. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తాను పార్టీ తరఫున బరిలోకి దిగుతానని చెప్పారు. అదే సమయంలో పార్టీ తమకు ఇంకో సీటు ఇచ్చినా రంగంలోకి దిగేందుకు తమ కుటుంబంలో ఇంకో ఇద్దరు సిద్ధంగానే ఉన్నారని కూడా ఆమె వ్యాఖ్యానించారు. వరంగల్ తూర్పుతో పాటుగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి క్లిష్టంగా ఉన్న సీటు ఇచ్చినా బరిలోకి దిగుతామని ఆమె చెప్పుకొచ్చారు. కొండా కుటుంబం బీజేపీలో చేరుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారం తామంటే గిట్టని వారు చేసే ప్రచారమేనని సురేఖ కొట్టిపారేశారు.