Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తిరుమల ఘాట్ రోడ్డులో మంటల్లో చిక్కుకున్న టీటీడీ ధర్మరథం బస్సు!

తిరుమల ఘాట్ రోడ్డులో మంటల్లో చిక్కుకున్న టీటీడీ ధర్మరథం బస్సు!

  • ఎగువ కనుమ రహదారిలో ప్రమాదం
  • బస్సు ఇంజిన్ లో మంటలు
  • అప్రమత్తమైన డ్రైవర్
  • మంటలను ఆర్పివేసిన అగ్నిమాపక సిబ్బంది

తిరుమల ఘాట్ రోడ్డుపై  ప్రమాదం తప్పింది. తిరుమల క్షేత్రంలో భక్తులను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ఉచితంగా తరలించే టీటీడీ ధర్మరథం బస్సు ఎగువ కనుమదారిలో అగ్నిప్రమాదానికి గురైంది. ఈ సాయంత్రం బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పొగ కమ్మేసింది. దాంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సు దిగి దూరంగా వెళ్లిపోయాడు.

ఆ సమయంలో బస్సులో భక్తులెవరూ లేరని తెలుస్తోంది. తిరుమల లింక్ రోడ్డు వద్ద ఈ ఘటన జరిగింది. బస్సు ఇంజిన్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.

Related posts

కేన్సర్ సోకిన చిన్నారుల కోసం టర్కీ ఆసుపత్రి కొత్త ప్రయత్నం!

Drukpadam

జులై 8 న పార్టీ ప్రకటన … వైయస్ షర్మిల

Drukpadam

తెలంగాణలో రేపటినుంచి 10 రోజుల లాక్ డౌన్

Drukpadam

Leave a Comment