కేసీఆర్ పై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్!
-యాదాద్రి నన్ను పిలవలేదు.. దేవుడి దగ్గర కేసీఆర్ బహునీచపు రాజకీయాలు
-దేవుడి దగ్గర కూడా కేసీఆర్ రాజకీయాలు
-పార్టీలకు అతీతంగా జరగాల్సిన కార్యక్రమాన్ని రాజకీయం చేశారు
-యాదాద్రి పునఃప్రారంభం విషయంలో సీఎంవో ప్రొటోకాల్ పాటించలేదు
-కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను మాత్రం ఆహ్వానించింది
-ఇలాంటి రాజకీయాలు చేయడం బాధాకరమన్న వెంకట్ రెడ్డి
యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి ఆలయ స్వయంభూ దర్శన ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం అట్టహాసంగా జరిగింది. దీనికి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన మంత్రి వర్గ సహచరులు , ఎంపీలు ఎమ్మెల్యే లు ,ఎమ్మెల్సీలు ఇతర అధికార పార్టీ ప్రజాప్రతినిధులను ఆహ్వానించారు . మిగతా భక్తులకు ఎవరికీ ఈ రోజు దాదాపు ప్రవేశం లేకుండా చేశారు . మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంతా అక్కడే ఉండటంతో పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు . ఇంతవరకు బాగానే ఉన్న అక్కడ ఉన్న స్థానిక ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదు . భవనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న యాదాద్రి లో అధికారికంగా ఏమి జరిగిన ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎంపీని పిలవాల్సిందే . అయితే ఆయన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కి చెందిన వారు . దీంతో కావాలనే ఎంపీ ని పిలవలేదని విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి. స్థానిక ఎంపీగా ఉన్న తనను ఈ కార్యక్రమానికి పిలవకపోవడంతో కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పాల్గొన్న కార్యక్రమానికి పిలవకపోవడం ప్రోటోకాల్ ఉల్లంఘన కిందకే వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయంభూ దర్శన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు . తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులతో పాటు రాష్ట్ర మంత్రులు పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
‘యాదాద్రి పునఃప్రారంభం విషయంలో తెలంగాణ సీఎంవో ప్రొటోకాల్ పాటించలేదు. స్థానిక ఎంపీగా వున్న నన్ను పునఃప్రారంభానికి పిలవలేదు. కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను మాత్రం ఆహ్వానించింది. దేవుడి దగ్గర కేసీఆర్ బహునీచపు రాజకీయాలు చేయడం బాధాకరం’ అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ట్వీట్ చేశారు.