Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఇది వడ్డనల కాలం …నలుగుతున్న సామాన్యుడు!

ఇది వడ్డనల కాలం …నలుగుతున్న సామాన్యుడు!
-ఒక పక్క కేంద్రం మరోపక్క రాష్ట్రం… సామాన్యులపై భారాలు
-ఇప్పటికే కేంద్రం గ్యాస్ , పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచింది.
-రాష్ట్రం విద్యుత్ , బస్సు చార్జీల ను పెంచింది.
-తిరిగి సెస్ పేరుతో ఆర్టీసీ చార్జీల పెంపు
-దురంతో సంబంధం లేదు …ఎక్స్ ప్రెస్ కు రూ 5
-సూప‌ర్ ల‌గ్జ‌రీ, రాజ‌ధాని, గ‌రుడ‌ల్లో రూ.10గా
-ప్యాసింజ‌ర్ సెస్ పేరిట తాజా వ‌డ్డ‌న‌
-ఇప్ప‌టికే ఆర్డిన‌రీలో సెస్ పేరిట రూ.1 వ‌సూలు
-దూరంతో సంబంధం లేకుండా చార్జీల మోత‌

తెలంగాణలో మ‌రోమారు ఆర్టీసీ చార్జీలు పెరిగాయి. ఇటీవ‌లే కిలో మీట‌రుకు ఇంత అంటూ ఆర్టీసీ బ‌స్సు చార్జీల‌ను పెంచుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ చార్జీల పెంపును జ‌నం మ‌రిచిపోకముందే.. మ‌రోమారు ఆర్టీసీ చార్జీల‌ను పెంచుతూ సోమవారం తెలంగాణ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. బస్సు ఎక్కితే రూ 5 నుంచి 10 దిగితే కూడా అంటే రూ 5 నుంచి 10 వసూల్ .కేంద్రం పెట్రోల్ రేట్లు పెంచుతుందంటూ ఇటీవల గగ్గోలు పెడుతున్న రాష్ట్ర చేసింది ఏమిటని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు .

కొత్త‌గా పెంచిన చార్జీల‌ను ప్యాసింజ‌ర్ సెస్ పేరిట వ‌సూలు చేయ‌నున్న‌ట్లుగా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే ఆర్డిన‌రీ బ‌స్సుల్లో సెస్ పేరిట రూ.1 వ‌సూలు చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. తాజాగా ప్ర‌తిపాదించిన ప్యాసింజ‌ర్ సెస్‌ను ఆర్డిన‌రీ బ‌స్సుల‌ను మినహాయించి మిగిలిన బ‌స్సుల్లో వ‌సూలు చేయ‌నున్నారు. పెంచిన ఈ చార్జీల‌ను ఏమాత్రం ఆల‌స్యం లేకుండా సోమ‌వారం నుంచే అమ‌ల్లోకి తెచ్చేశారు.

ఈ ప్యాసింజ‌ర్ సెస్.. ఎక్స్‌ప్రెస్,డీల‌క్స్ బ‌స్సుల్లో రూ.5గా ఉండ‌గా.. సూప‌ర్ ల‌గ్జ‌రీ, రాజ‌ధాని, గ‌రుడ‌ల్లో రూ.10గా నిర్ణ‌యించారు. ఈ సెస్ వ‌సూలు కార‌ణంగా దూరంతో సంబంధం లేకుండా జ‌నంపై భారం ప‌డ‌నుంది. టికెట్ తీసుకున్న ప్ర‌తి ప్ర‌యాణికుడిపై ఈ సెస్‌ను వ‌సూలు చేయ‌నున్నారు.

Related posts

బీజేపీపై పోరుకు విప‌క్షాల స‌న్న‌ద్ధం… 12 పార్టీల‌తో క‌లిసి కాంగ్రెస్ ప్ర‌క‌ట‌న‌!

Drukpadam

కేసిఆర్ పాలన అంటే లిక్కర్.. లీకేజీల పాలన…!

Drukpadam

జాతీయపార్టీ పేరుతోనే మునుగోడు ఎన్నికలకు …పార్టీ సమావేశంలో కేసీఆర్!

Drukpadam

Leave a Comment