Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీజేపీ బరితెగింపు పాలన…సిపిఎం ,సిపిఐ ,ప్రజాపంథా , టీఆర్ యస్

బీజేపీ బరితెగింపు పాలన…సిపిఎం ,సిపిఐ ,ప్రజాపంథా , టీఆర్ యస్
మాటల్లో జాతీయత…ఆచరణలో విధ్వంసం
కార్పొరేట్లకు ప్రభుత్వరంగ సంస్థల ధారాదత్తం
కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి..
ఖమ్మం జిల్లా కార్మిక సంఘాల సమ్మె సక్సెస్

ఖమ్మం…

బీజేపీ ప్రభుత్వం పాలన చేస్తున్నదని సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, బాగం హేమంతరావు, పోటు రంగారావు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మాటల్లో దేశభక్తి, జాతీయత గురించి చెబుతూ, ఆచరణలో విధ్వంసకర విధానాలు అవలంబిస్తోందన్నారు. సహజ వనరులు, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తోందన్నారు. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్, బఎన్టీయూ, టీఆర్ఎస్కేవీ తదితర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా తొలిరోజు ఖమ్మం జిల్లా బంద్ విజయవంతమైంది.

దీనిలో భాగంగా ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నాచౌక్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నేతలు మాట్లాడారు. కార్మిక, ప్రజా ఉ ఉపుతూ రాజ్యాంగబద్ధంగా పౌరులకున్న ప్రాథమిక హక్కులను సైతం కేంద్రం హరించివేస్తోందన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇస్తామన్న కేంద్రం నేటి వరకు దాని ఊసు ఎత్తడం లేదన్నారు. రుణాలు రద్దునూ విస్మరించిందన్నారు. పంట మద్దతు ధర ఇలా రకరకాల హామీలు కార్మిక, కర్షకులకు ఇచ్చి ఇప్పుడు వాటిని తుంగలో తొక్కుతోందన్నారు. జాతీయ దురభిమానాన్ని రెచ్చగొడుతోందన్నారు. సంఘటిత, అసంఘటిత కార్మికులకు ఇచ్చిన హామీలను విస్మరిస్తోందన్నారు. కార్మికులు సుదీర్ఘకాలం పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని కూడా తీసివేయాలని చూస్తోందన్నారు. బీజేపీ అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలన్నారు. *నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. మాటల్లో జాతీయత… ఆచరణలో విధ్వంసకర విధానాలను మోడీ ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ

అంతకుముందు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారీ ర్యాలీ తీశారు. స్థానిక పెవిలియన్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ మయూరిసెంటర్, పాతబస్టాండ్, వైరా రోడ్డు, జడ్బీ సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకు సాగింది. ఆటోవర్కర్లు, బిల్డింగ్ వర్కర్లు, హమాలీలు, బ్యాంకు ఉద్యోగులు, టీచర్స్ యూనియన్లు, ఉద్యోగ సంఘాలు సమ్మెకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నాయి* ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, సీఐటీయూ, బిఎసీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు విష్ణువర్ధన్, కళ్యాణం వెంకటేశ్వరరావు, రామయ్య, రామారావు, గాదె లక్ష్మీనారాయణ, బీజీ క్లైమెంట్, నరేష్ మోహన్, కొత్త సీతారాములు, టీఆర్ఎస్ కేవీ నేతలు పాల్వంచ కృష్ణ, కమర్తపు మురళి, పగదాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పన్ను’పోటుతో వేధించడం మీకు పైశాచిక ఆనందమా?: రేవంత్ రెడ్డి

Drukpadam

రేవంత్ రెడ్డితోనే నా పంచాయితీ: జగ్గారెడ్డి!

Drukpadam

బీజేపీ ఓటమి నేపథ్యంలో రాజీనామా సమర్పించిన కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై….

Drukpadam

Leave a Comment