Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఢీ అంటే ఢీ అంటున్న వైరి వర్గాలు …అందరి చూపు పాలేరు వైపు …

ఢీ అంటే ఢీ అంటున్న వైరి వర్గాలుఅందరి చూపు పాలేరు వైపు
ప్రజల మనస్సులు చూరగొనేందుకు పోటీపడుతున్న నేతలు
టికెట్ పై ఇరువురిధీమా
సీటింగ్ లకు టికెట్స్ పై కేసీఆర్ భరోసా అనే ధీమాతో కందాల
జనం తమ కే జైజైలు పలుకుతున్నారంటున్న తుమ్మల

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంపై రాజకీయ వాతావరణం కేంద్రీకృతంమై ఉంది. అసలే ఎండలు దీనికి తోడు వైరి శిబిరాలు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను చిత్తూ చేసేలా పథకరచనలు చేస్తున్నాయి. ప్రస్తుత శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి ,టీఆర్ యస్ కు చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మధ్య టికెట్స్ కోసం హోరాహోరి ఫైట్ నడుస్తుంది. దీంతో పాలేరులో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. . గత ఎన్నికల్లో టీఆర్ యస్ నుంచి పోటీచేసి ఓడిపోయిన మాజీమంత్రి తుమ్మల ఈ నియోజవర్గం పై ద్రుష్టి సారించారు. తరచూ నియోజకర్గంలో పర్యటిస్తూ ఈసారి పోయిన సారిలా కానివ్వనని తన తడాకా చూపిస్తానని అంటున్నారు . ఇక కందాల కూడా సీఎం కేసీఆర్ సిట్టింగులకే టికెట్స్ ఇస్తామన్నారని అందువల్ల తన టికెట్ కు డోకాలేదనే విశ్వాసం తో ఉన్నారు . పైగా ప్రశాంత కిషోర్ ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు టికెట్స్ ఇవ్వద్దని అంటున్నారని అందువల్ల తనపై నియోజకవర్గ ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని తన టికెట్ విషయంలో వేరే ఆలోచనకు తావులేదని అంటున్నారు.

ఇద్దరు నేతలు టికెట్ విషయంలో నమ్మకంతో ఉండటంతో ప్రజల్లో కన్ఫ్యూజన్ ఉంది. టికెట్ ఎవరికీ వస్తుంది సిట్టింగ్ గా ఉన్న కందాల కా ? మాజీమంత్రి తుమ్మలకా అనే చర్చ నడుస్తుంది. దీంతో పాలేరు టీఆర్ యస్ లో గెలుపు సంగతి తరువాత టికెట్ కోసం ఫైట్ జరుగుతుండటం ఆశక్తికరంగా మారింది. దీంతో ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు . పోలీస్ కేసులు పెట్టుకుంటున్నారు . ఒకే పార్టీలో జరుగుతున్న ఈ తగాదాలు పార్టీ కార్యకర్తలకు ఇబ్బందిగా మారాయి. మరో విచిత్రమేమంటే కందాల ,తుమ్మల గ్రూపులతో పాటు,పొంగులేటి అనుచరులు కూడా ఇక్కడ గణనీయమైన సంఖ్యలోనే ఉండటం ఇక్కడ ప్రత్యేకతగా చెప్పవచ్చు.

పాలేరు తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ యస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను కేసీఆర్ , కేటీఆర్ దృష్టికి నాయకులు అనేకసార్లు తీసుకోని పోయినప్పటికీ వినడమే తప్ప పరిష్కరించిన దాఖలాలు లేవనే అభిప్రాయాలు ఉన్నాయి. పార్టీని నమ్ముకొని ఇతర పార్టీల నుంచి చేరినవారిని చేరేటప్పుడు అక్కున చేర్చుకోవడమే తప్ప తరువాత కాలంలో పట్టించుకోకపోవడం పై విమర్శలు ఉన్నాయి. అందువల్ల అనేక జిల్లాల్లో ఇదే సమస్య ఉన్నా, ఖమ్మం జిల్లాలో బలమైన నాయకులకు సముచిత స్తానం ఇవ్వకపోవడం , అధినేత నుంచి ఎలాంటి హామీ లేకపోవడం నాయకులను కూర్చోబెట్టి మాట్లాడకపోవడం భవిష్యత్ లో పార్టీకి ఇబ్బందికరంగా మారె అవకాశాలు ఉన్నాయని రాజకీయపరిశీలకుల అభిప్రాయం .

Related posts

పార్లమెంట్ లో కేసీఆర్ అవమానించిన బండి సంజయ్ పై స్పీకర్ ఏమి చర్యలు తీసుకుంటారు …!

Ram Narayana

మంగమ్మ శపదాలకు భయపడం పొంగులేటి వ్యాఖ్యలపై …మంత్రి అజయ్ ఫైర్…

Drukpadam

ప్రశాంత్ కిశోర్ ఎత్తుగడలు తెలంగాణలో పనిచేయవు: ఈటల

Drukpadam

Leave a Comment