Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఎన్నికల హామీలపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ నిలదీసిన మహిళలు…

ఎన్నికల హామీలపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ నిలదీసిన మహిళలు…
ప్రతిగా పోలీస్ స్టేష‌న్‌లో ఎమ్మెల్యే నిరసన ఉద్రిక్తత …
తనకు తగిన బందోబస్తు ఇవ్వకపోవడంపై ఆగ్రహం…
సిద్ధిపేట సిపి వచ్చే వరకు స్టేషన్ దీక్ష విరమించనని బైఠాయింపు
మిరుదొడ్డి ప‌ర్య‌ట‌న‌లో ఎమ్మెల్యేను నిల‌దీసిన మ‌హిళ‌లు
మ‌హిళ‌లు, బీజేపీ శ్రేణుల మ‌ధ్య తోపులాట‌
నేరుగా పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి నిర‌స‌న దీక్ష‌కు దిగిన వైనం

బీజేపీ నేత‌, దుబ్బాక ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు గురువారం నియోజకవర్గంలో పర్యటనకు వెళ్లారు . అక్కడ ఆయన్ను ఎన్నికల హామీలపై స్థానిక మహిళలు నిలదీశారు . ఈ సందర్భంగా మహిళలకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో ఎమ్మెల్యే ఖంగు తిన్నారు . పోలీస్ బందోబస్తు సరిగా ఇవ్వనందునే మహిళలు గుంపుగా వచ్చారని ఎమ్మెల్యే రఘునందన్ రావు పోలీసుల‌పై ఆరోప‌ణ‌లు గుప్పిస్తూ పోలీస్ స్టేష‌న్‌లోనే నిర‌స‌న దీక్ష‌కు దిగారు. ర‌ఘునంద‌న్ రావు నిర‌స‌న‌తో సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి పోలీస్ స్టేషన్‌లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. గురువారం మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో పోలీస్ స్టేష‌న్‌లోనే దీక్ష‌కు దిగిన ర‌ఘునంద‌న్ రావు.. 4 గంట‌లు గ‌డుస్తున్నా.. సిద్దిపేట పోలీస్ క‌మిష‌న‌ర్ వ‌చ్చేదాకా దీక్ష విర‌మించేది లేద‌ని బీష్మించారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

ఉప ఎన్నిక‌లో దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచిన ర‌ఘునంద‌న్ రావు గురువారం మిరుదొడ్డి ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ను అడ్డుకున్న మ‌హిళ‌లు ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీల‌ను ఎందుకు అమ‌లు చేయ‌లేద‌ని నిల‌దీశారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌తో తీవ్రంగా క‌ల‌త చెందిన ర‌ఘునంద‌న్ రావు త‌న‌కు స‌రిప‌డ బందోబ‌స్తు క‌ల్పించ‌ని కార‌ణంగానే ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఆ వెంట‌నే ఆయ‌న మిరుదొడ్డి పోలీస్ స్టేష‌న్‌కు చేరుకున్నారు. త‌న ప‌ర్య‌ట‌న‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌కు మిరుదొడ్డి ఎస్సై, సీఐలే కార‌ణ‌మ‌ని, ఆ ఇద్ద‌రు పోలీసు అధికారులు ఉద్దేశ‌పూర్వ‌కంగానే త‌న‌కు బందోబ‌స్తు క‌ల్పించ‌లేద‌ని ఆరోపిస్తూ..వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేష‌న్‌లోనే నిర‌స‌న‌కు దిగారు. దీక్ష విర‌మించాల‌ని పోలీసులు ఎంత‌గా న‌చ్చ‌జెప్పినా విన‌ని ర‌ఘునంద‌న్ రావు.. సిద్దిపేట పోలీస్ క‌మిష‌నర్ వ‌చ్చేదాకా తాను దీక్ష విర‌మించ‌న‌ని బీష్మించారు. ఈ విష‌యం తెలుసుకున్న‌బీజేపీ శ్రేణులు పోలీస్ స్టేష‌న్‌కు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. ప‌రిస్థితిని అంచ‌నా వేసిన పోలీసులు పోలీస్ స్టేష‌న్ గేట్లు మూసేశారు.

Related posts

బీజేపీలో చేరిన కొన్నిరోజులకే పంజాబ్ ఎమ్మెల్యేకి జడ్ కేటగిరీ భద్రత!

Drukpadam

బొత్స‌, అంబ‌టి వ్యాఖ్య‌లు బాధాక‌రం: తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ!

Drukpadam

22 దేశాలు.. 56 రోజులు.. 12 వేల కిలోమీటర్లు.. బస్సులో ప్రపంచ యాత్ర!

Drukpadam

Leave a Comment