వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఎలుకలు!.. ఐసీయూలో రోగిని కొరికేసిన వైనం!
-ఎంజీఎంలో రోగి కాలును కొరికేసిన ఎలుకలు
-ఘటనపై పలు టీవీ ఛానెళ్లలో కథనాలు
-తక్షణమే స్పందించిన మంత్రి హరీశ్ రావు
ఆసుపత్రులలో పారిశుద్యం పై అనేక విమర్శలు ఉన్నాయి. గతంలో ఏపీ లోని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలకలు పేషంట్లను కోరిన సంగతి తెలిసిందే . తెలంగాణ రాష్ట్రంలో హైద్రాబాద్ తరువాత అత్యంత ప్రతిష్ట్మాక ఆసుపత్రి వరంగల్ లోని ఎం జి ఎం లో ఎలుకలు పేషంట్ ను కొరకడం విమర్శలకు తావిస్తున్నది . ఇక్కడకు చుట్టుపక్కల అనేక జిల్లాలనుంచి రోగులు వస్తారు . అనేకమంది డాక్టర్లు , సిబ్బంది అత్యాధునిక వైద్య సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. కానీ పరిశుభ్రత లోపం ఎలుకలు వస్తున్నాయని తెలిసిన సరైన చర్యలు చేపట్టి వాటిని రాకుండా చేయాంలో వైఫల్యాలు ఉన్నాయి
దీంతో ఆసుపత్రిలో ఎలుకలు యథేచ్ఛగా తిరుగుతున్న వైనంపై ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. ఆసుపత్రిలో సంచరిస్తున్న ఎలుకలు.. ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ రోగి కాలును కొరికేశాయి. ఈ ఘటనపై గురువారం నాడు పలు టీవీ ఛానెళ్లలో వార్తలు ప్రసారం కావడంతో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆసుపత్రిగా పేరుగాంచిన ఎంజీఎంలో ఎలుకలు సంచరిస్తున్నాయంటే.. ఆసుపత్రిలో పారిశుద్ధ్యం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతోందని మంత్రి అధికారులను మందలించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. వెంటనే నివేదిక అందజేయాలని కోరారు .
ఆసుపత్రిలో ఎలుకల ఎఫెక్ట్… ఎంజీఎం సూపరింటెండెంట్, వైద్యులపై వేటు
- వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఎలుకల సంచారం, ఐసీయూలోని రోగి కాలును ఎలుకలు కొరికేసిన ఘటనను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనకు బాధ్యుడిగా ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావును గుర్తించిన ప్రభుత్వం ఆయనపై బదిలీ వేటు వేసింది. ఆయన స్థానంలో చంద్రశేఖర్‌కు కొత్త సూపరింటెండెంట్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.