Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

భద్రాద్రిలో నిరాడంబరంగా శ్రీరామ నవమి వేడుకలు… మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

భద్రాద్రిలో నిరాడంబరంగా శ్రీరామ నవమి వేడుకలు… మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
భక్తులు లేకుండా ఆలయంలోనే వేడుకలు
ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బులు వెనక్కి
ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఉత్సవాలను వీక్షించాలన్న మంత్రి
పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచంలో ఈసారి శ్రీరామ నవమి వేడుకలు నిరాడంబరంగా జరగనున్నాయి. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో వేడుకలను భక్తులు లేకుండానే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆలయంలోనే వేడుకలు నిర్వహించనున్నారు. కాబట్టి వేడుకలకు రావొద్దని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి భక్తులకు సూచించారు. కరోనా వైరస్‌ను అదుపులో పెట్టేందుకు ఉత్సవాలు, ఊరేగింపులపై ప్రభుత్వం ఆంక్షలు విధించిందని, ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు డబ్బులు వెనక్కి ఇస్తామని, శ్రీరామ నవమి వేడుకలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించాలని మంత్రి పేర్కొన్నారు. భక్తులందరూ విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు.
గత ఏడాది కూడా ఇదే ఇదంగా కల్యాణ వేడుకలను నిర్వనించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ ఇదివరకే ఈ విషయాన్నీ ప్రకటించారు.తమ శాఖకు సంబందించిన ఆశంలపై ఇతర శాఖల మంత్రులు స్పందించటం పై అల్లోల తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీని పై ఇద్దరు మంత్రుల మధ్య నెలకొన్న గ్యాప్ ను పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ దగ్గర చర్చించుకున్నారని ఒకరి శాఖ విషయాలను మరో శాఖ మంత్రి అనుమతి లేకుండా ప్రకటించకూడదని చెప్పినట్లు సమాచారం . ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి భద్రాచలంలో ప్రతి సంవత్సరం మిథిలా స్టేడియం లో జరిగే కల్యాణ మహోత్సవాన్ని కరోనా తిరిగి విజృభించుస్తున్న దృష్ట్యా ఈ ఏడాది కూడా ఆలయం లోపల ప్రాగణంలో కళ్యాణం నిర్వవించనున్నారు.అయితే ఇప్పటికే కల్యాణ టిక్కెట్లు అమ్మినందున వాటికీ సంబందించిన డబ్బులను తిరిగి చెల్లించనున్నారు.

Related posts

అన్ని కుటుంబ వ్యాపారాలకు జగన్ ‘గార్డియన్’ మాత్రమే..ష‌ర్మిల‌

Ram Narayana

కొత్తపల్లి గీత ఎస్టీ కాదంటూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు

Ram Narayana

తక్షణమే రఘురామను ఆసుపత్రికి తరలించండి: హైకోర్టు ఆదేశం…

Drukpadam

Leave a Comment