తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు!
- రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకల్లో ప్రసంగించిన తమిళిసై
- వచ్చే నెల నుంచి ప్రజా దర్బార్ నిర్వహిస్తానని వెల్లడి
- రాజ్ భవన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని వ్యాఖ్య
తెలుగు సంవత్సరాది ఉగాది వేళ తమిళనాడు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగాది పండుగను పురస్కరించుకుని రాజ్ భవన్‌లో ఏర్పాటు చేసిన వేడుకల్లో భాగంగా ప్రసంగించిన తమిళిసై కీలక వ్యాఖ్యలుచేశారు. రాజ్ భవన్ పరిధి ఏమిటో తనకు తెలుసునని, తనను ఎవరూ నియంత్రించలేరని ఆమె చెప్పారు. తనకు ఎలాంటి ఇగో లేదని కూడా ఆమె తేల్చి చెప్పారు.
వచ్చే నెల నుంచి రాజ్ భవన్‌లో ప్రజా దర్బార్ నిర్వహిస్తానని ప్రకటించిన ఆమె..రాజ్ భవన్‌లో ప్రజలను నేరుగా కలుస్తానని వెల్లడించారు. ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుంటానని, ప్రజల కోసం రాజ్ భవన్ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలకు తాను సోదరినని, ఉగాది నుంచి తెలంగాణలో నవశకం ప్రారంభమవుతుందని ఆమె తెలిపారు. ప్రభుత్వంతో కలిసి తెలంగాణ అభివృద్ధికి పాటుపడతానని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.
హైదరాబాద్ రాజ్ భవన్‌లో ఉగాది వేడుకలు.. గైర్హాజరైన సీఎం, మంత్రులు
తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌లో ఆ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉగాది వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, సీపీఐ నేత చాడా వెంకట్ రెడ్డిలు హాజరయ్యారు.
అయితే అనూహ్యంగా ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ గానీ, ఆయన కేబినెట్‌లోని మంత్రుల్లో ఒక్కరంటే ఒక్కరూ హాజరు కాకపోవడం గమనార్హం. ఏ కారణం చేత వీరు రాజ్ భవన్ ఉగాది వేడుకలకు హాజరు కాలేదన్న విషయంపై స్పష్టత లేదు.