Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అమ‌రావ‌తిపై ఏపీ హైకోర్టులో ప్ర‌భుత్వం అఫిడ‌విట్.. 

అమ‌రావ‌తిపై ఏపీ హైకోర్టులో ప్ర‌భుత్వం అఫిడ‌విట్.. 

  • మార్చి 3న రాజ‌ధానిపై హైకోర్టు తీర్పు
  • ప‌నుల పూర్తికి నెల రోజుల గ‌డువిచ్చిన కోర్టు
  • గ‌డువు ముగియ‌నున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం అఫిడ‌విట్‌
  • ప‌నుల పూర్తికి త‌మ‌కు 2024 జ‌న‌వ‌రి వ‌ర‌కు గ‌డువుంద‌ని వెల్ల‌డి

ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తినే కొన‌సాగించాలంటూ ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పున‌కు సంబంధించి తాజాగా రాష్ట్ర ప్ర‌భుత్వం హైకోర్టులో ఓ అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. 190 పేజీల‌తో కూడిన ఈ అఫిడ‌విట్‌లో ప్ర‌భుత్వం ప‌లు అంశాల‌ను ప్రస్తావించింది.

ప్ర‌ధానంగా రైతుల‌కు అందించ‌నున్న ప్లాట్ల‌లో ప‌నులు పూర్తి చేసి నెల‌రోజుల్లోగా నివేదిక ఇవ్వాల‌న్న హైకోర్టు ఆదేశంపై ప్ర‌భుత్వం ఈ అఫిడవిట్‌లో ప్ర‌ధానంగా ప్ర‌స్తావించింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం త‌ర‌ఫున రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌దర్శి స‌మీర్ శర్మ హైకోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేశారు.

రైతుల‌కు అందించ‌నున్న ప్లాట్ల‌లో నెల రోజుల్లోగా ప‌నులు పూర్తి చేసి నివేదిక ఇవ్వాల‌ని హైకోర్టు తీన తీర్పులో వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. హైకోర్టు నుంచి తీర్పు మార్చి 3న విడుద‌లైంది. అంటే.. స‌రిగ్గా శ‌నివారం (ఏప్రిల్‌) నాటికి నెల రోజుల గడువు పూర్తి అయ్యింది. ఈ క్ర‌మంలోనే హైకోర్టు విధించిన గ‌డువు ముగియ‌నున్న చివ‌రి క్ష‌ణంలో ఏపీ ప్రభుత్వం హైకోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది.

ఇక ఈ అఫిడ‌విట్‌లో ఏముంద‌న్న విష‌యానికి వ‌స్తే.. అమ‌రావ‌తిలో ప‌నులు పూర్తి చేసే విష‌యంలో ప్ర‌భుత్వం మ‌రో నాలుగేళ్ల గ‌డువు పొడిగించింద‌ని సీఎస్ స‌మీర్ శ‌ర్మ అందులో తెలిపారు. ఈ లెక్క‌న రైతుల ప్లాట్లు స‌హా ఇత‌ర‌త్రా ప‌నుల పూర్తికి త‌మ‌కు 2024 జ‌న‌వ‌రి దాకా గ‌డువు ఉంద‌ని ఆయ‌న తెలిపారు.

Related posts

మెక్సికోలో ఘోర ప్రమాదం.. 27 మంది మృతి…

Drukpadam

సాక్షి మీడియాకు లీగల్ నోటీసు పంపిన రఘురామకృష్ణరాజు

Drukpadam

హుజూరాబాద్ లో తొలిసారి టీఆర్ఎస్ కు లీడ్.. ఎంతంటే..

Drukpadam

Leave a Comment