Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

చంద్ర‌బాబు నోటికి ప్లాస్ట‌ర్ వేసుకోవాలి: బొత్స తీవ్ర వ్యాఖ్య‌

చంద్ర‌బాబు నోటికి ప్లాస్ట‌ర్ వేసుకోవాలి: బొత్స తీవ్ర వ్యాఖ్య‌

  • జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై చంద్రబాబు విమ‌ర్శ‌లు
  • వాటిని గుర్తు చేసుకున్న మంత్రి బొత్స‌
  • స‌ల‌హాలు ఇస్తే ఫ‌ర‌వా లేదు గానీ విమ‌ర్శ‌లు చేయొద్దంటూ సూచ‌న‌

టీడీపీ అధినేత‌, ఏపీ అసెంబ్లీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబునాయుడిపై వైసీపీ కీల‌క నేత‌, మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. విప‌క్ష నేత హోదాలో ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాలు తీసుకునే ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు సంధించ‌డం దాదాపుగా అంద‌రు రాజ‌కీయ నేత‌లు చేస్తున్న‌దే. అయితే జ‌గ‌న్ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న చంద్ర‌బాబు ఇక‌పై విమ‌ర్శ‌లు చేయొద్దంటూ బొత్స ఓ స‌ల‌హా ఇచ్చారు.

సోమ‌వారం నాడు మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా త‌మ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న చంద్ర‌బాబుపై బొత్స విరుచుకుప‌డ్డారు. ఏపీ కూడా మ‌రో శ్రీలంక‌లా అవుతుందంటూ ఇటీవ‌ల చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేసిన బొత్స‌.. చంద్ర‌బాబు అలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం దుర్మార్గ‌మ‌ని అన్నారు. జ‌గ‌న్ సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తుంటే చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. మంచి స‌ల‌హాలు ఇవ్వ‌క‌పోతే చంద్ర‌బాబు నోటికి ప్లాస్ట‌ర్ వేసుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా బొత్స తీవ్ర వ్యాఖ్య చేశారు. చంద్రబాబు స‌ల‌హాలు ఇస్తే ఫ‌ర‌వా లేదు గానీ విమ‌ర్శ‌లు చేయొద్దంటూ బొత్స వ్యాఖ్యానించారు.

Related posts

సీఎంను ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులా ?.. దమ్ముంటే నాపై పెట్టండి: బండి సంజయ్ సవాల్!

Drukpadam

పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో తనపట్ల వివక్ష …సొంతపార్టీ పై శశిథరూర్ వ్యాఖ్యలు…

Drukpadam

ఏపీ లో నిర్బంధాల మధ్య రహస్య ప్రయాణం చేసిన తెలుగుదేశం నేతలు!

Drukpadam

Leave a Comment