Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పట్టభద్రులు అమ్ముడుపోయారా?

( వ్యాసకర్త  కపిలవాయి రవీందర్…వరంగల్)

నిజమా.?
పట్టభద్రులు అమ్ముడుపోయారా?
..
చదువుకున్నోడు కూడా నోట్లు తీసుకోని ఓట్లేశారని,పట్టభద్రులు అమ్ముడుపోయారని, ప్రలోభాలకు లోనయ్యారని
గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలలో పలువురు ఆరోపించారు.పలుపార్టీలు సైతం తీవ్రంగా ఆరోపించాయి..
ఇప్పటికీ అదేమాట అంటుంటే
దీనిపై ఒక చిన్న విశ్లేషణ…!
..
నల్గొండ,వరంగల్,ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో పోటీచేసిన అభ్యర్థులు..
TRS, తీన్మార్ మల్లన్న, కోదండరాం,
BJP ,కాంగ్రెస్, కమ్యూనిస్టులు,రాణి రుద్రమ,
చెరుకు సుధాకర్, మరి ఇతర అభ్యర్థులు మొత్తం 71 మంది పోటీచేశారు..
..
తీన్మార్ మల్లన్న ఎవరికీ డబ్బులు ఇవ్వలేదు..
కానీ,ఒక దశలో గెలుస్తాడేమో అనుకునే విధంగా
గట్టి పోటీ ఇచ్చాడు.
పట్టభద్రులే ఓట్లు వేసారు..
..
కోదండరాం కూడా ఎవరికీ పైసా ఇయ్యలేదు.
బాగా ఓట్లు వచ్చాయి.. మూడవ స్థానంలో నిలిచారు.
..
ఇక బిజెపి అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి కూడా ఎవరికీ
నయా పైసా ఇయ్యలేదు..
కార్యకర్తలు తమ సొంత డబ్బులు ఖర్చుచేసి, రాత్రింబవళ్ళు కష్టపడి, నిస్వార్థంగా ప్రచారం చేసారు..
(అది బిజెపి కార్యకర్తల గొప్పగుణం).
దాదాపు యాభైవేల ఓట్లు వచ్చాయి..
పట్టభద్రులే వేశారు..
..
కాంగ్రెస్,చెరకు సుధాకర్, రాణి రుద్రమలు కూడా ఎవరికీ పైసలు పంచలేదు..
అయినా చెప్పుకోదగ్గ ఓట్లు వచ్చినయ్..
..
ఇగ కమ్యూనిస్టుల విషయానికివస్తే,
వాళ్ళు తీసుకోవటమేకానీ,
ఇచ్చేదేం ఉండదని అందరికీ తెలిసిందే..
..
నల్గొండ, హైదరాబాద్ లలో
TRS అభ్యర్థులకు వచ్చిన ఓట్లు కేవలం
30 నుండి 35 శాతం మాత్రమే..
దీంట్లో కూడా ఒక పదిశాతం డబ్బులు తీసుకోకుండా ఓటువేసి ఉండొచ్చు..
అధికార పార్టీ దొంగఓట్లు చేర్పించిందని
చాలామంది చెప్పుకున్నారు..
ఇంటి యజమానికి తెలియకుండా ఒక ఇంట్లోనే పది ఓట్లు చేర్పించారని,అట్లా చాలాచోట్ల జరిగిందని, మీడియాలో కూడా వచ్చింది..
ఇవేకాక, పోలింగ్ రోజు ఏజెంట్లను బెదిరించటం,
ఓట్ల లెక్కింపు రోజున గోల్ మాల్ చేశారని,
బాక్స్ తాళాలు తెరిచి ఉన్నాయని,
ఇదేంటని ప్రశ్నించినవారిని, పోలీసులతో బయటకు పంపించారనే ఆరోపణలు,ఇతర అనేక కారణాలు అధికార పార్టీ అభ్యర్థుల గెలుపుకు దారితీసాయి..
..
అంతేకాక పోటీచేసిన అభ్యర్థుల మద్య ఐకమత్యం లేకపోవడం,కొందరు కోవర్టు అభ్యర్థులు పోటీ చేసి సహకరించటం వలన TRS కు లాభం జరిగింది..
..
So..
పట్టభద్రులు దాదాపు 70 శాతం మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటువేసారనేది వాస్తవం..
సుమారుగా ఒక ఇరవై నుండి ఇరవై అయిదు శాతం మందిని దృష్టిలో ఉంచుకుని,
అందర్నీ నిందించడం కరెక్ట్ కాదు..
..
పట్టభద్రులు పర్ఫెక్ట్ గానే ఉన్నారు.
అభ్యర్థులే కరెక్ట్ గా లేరు–

Related posts

విశాఖలో పరిణామాలపై పవన్ కల్యాణ్ కు చంద్రబాబు ఫోన్!

Drukpadam

హుజూరాబాద్​ లో దళితబంధు అమలులకు ఉత్తర్వులు …

Drukpadam

కాంగ్రెస్ రాజ్ భవన్ ముట్టడి హింసాత్మకం బస్సు అద్దాలు ధ్వంసం, బైక్ దహనం!

Drukpadam

Leave a Comment