Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాహుల్ గాంధీతో జ‌గ్గారెడ్డి భేటీ…

రాహుల్ గాంధీతో జ‌గ్గారెడ్డి భేటీ…
-ఢిల్లీలో జ‌రిగిన భేటీ
-పార్టీ ప‌రిస్థితుల‌పై వివ‌రించిన జ‌గ్గారెడ్డి
-రేవంత్‌తో జ‌గ్గారెడ్డి విభేదాల నేప‌థ్యంలో భేటీకి ప్రాధాన్యం

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాజకీయాలు ఢిల్లీ చేరిన సంగతి తెలిసిందే .రెండురోజుల కిందట రాష్ట్ర కాంగ్రెస్ లోని ముఖ్యనేతలను రాహుల్ గాంధీ ఢిల్లీకి పిలిచి మాట్లాడారు . సుమారు 40 ఆహ్వానం అందుకున్న నేతలు హుటాహుటిన ఢిల్లీ చేరుకొని రాహుల్ తో భేటీ అయ్యారు. వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది . కాంగ్రెస్ కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్న వ్యక్తిని పరిచయం చేయడంతోపాటు ఆయన సలహాల మేరకు పనిచేయాలని సూచించారు . చిన్న చిన్న సమస్యలపై స్పందించకుండా పార్టీ కోసం పనిచేయాలని రాష్ట్ర నేతలకు రాహుల్ దిశా నిర్దేశం చేశారు . నేతల మధ్య నెలకొన్న తగాదాలను రాహుల్ గాంధీకి చెప్పి మనసును కుదట పడేసుకోవాలని భావించిన నేతలు రాహుల్ అపాయింట్మెంట్ అడిగారు . ప్రధానంగా ఇటీవల కాలంలో తగాదాలకు కేంద్ర బిందువైన జగ్గారెడ్డి నేడు రాహుల్ తో ప్రత్యేక భేటీ అయ్యారు . ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వ్యవహారశైలిపై ఫిర్యాదు చేశారు . దీనిపై అన్ని విన్న రాహుల్ మంచిది చూద్దాం మీ పని మీరు చేసుకోండని సలహా ఇచ్చినట్లు సమాచారం …

కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ సీనియ‌ర్ నేత‌, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి (జ‌గ్గారెడ్డి) బుధ‌వారం ఆ పార్టీ కీల‌క నేత రాహుల్ గాంధీతో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఇప్ప‌టికే టీపీసీసీ వ్య‌వ‌హారాల‌పై చ‌ర్చిస్తున్న రాహుల్ గాంధీ.. బుధ‌వారం త‌న‌ను క‌లిసేందుకు జ‌గ్గారెడ్డికి అపాయింట్‌మెంట్ ఇచ్చారు. దీంతో రాహుల్ గాంధీతో భేటీ అయిన జ‌గ్గారెడ్డి.. పార్టీలో చోటుచేసుకున్న ప‌లు ప‌రిణామాల‌ను రాహుల్‌కు వివ‌రించారు.

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత త‌న‌కు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని, క‌నీసీ టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న త‌న‌కు కీల‌క నేత‌ల కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన స‌మాచారం కూడా ఇవ్వ‌డం లేద‌ని జ‌గ్గారెడ్డి ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌నను పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి నుంచి త‌ప్పిస్తూ రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో భ‌గ్గుమ‌న్న జ‌గ్గారెడ్డి.. తాను అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాన‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే రాహుల్ గాంధీతో జ‌గ్గారెడ్డి భేటీ ప్రాధాన్యం సంత‌రించుకుంది.

Related posts

అధికారం కోసం ఎప్పుడూ వెంపర్లాడలేదు…చంద్రబాబు

Drukpadam

వారి చేష్టలు, వ్యాఖ్యలు దేశాన్ని కించపరిచేలా ఉన్నాయి… ప్రతిపక్షాలపై ప్రధాని మండిపాటు!

Drukpadam

ఖమ్మం జిల్లాలో పొంగులేటి అనుచరులపై కక్ష సాధింపు…తెరపైకి పాతకేసులు…!

Drukpadam

Leave a Comment