Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

దాతృత్వం చాటిన ఖమ్మం జిల్లా సుజాతనగర్ మాజీ ఎమ్మెల్యే సతీమణి రుక్మిణమ్మ..

దాతృత్వం చాటిన ఖమ్మం జిల్లా సుజాతనగర్ మాజీ ఎమ్మెల్యే సతీమణి రుక్మిణమ్మ..
-అన్నం ఫౌండేషన్‌కు రూ.2 కోట్ల విలువైన ఇల్లు వితరణ
-ఆమె మనసు వెన్నఅంటు ప్రసంశలు
-ఆమె దాతృత్వానికి వందనాలు తెలుపుతున్న ప్రజలు

మాటలు అందరు చెపుతారు …కానీ కొందరు మాత్రమే దాతృత్వం చాటుతారు … కావలసినంత ఆస్తులు ఉన్న పొరుగువాడికి సహాయపడేందుకు ముందుకు రారు …అలాంటిది తనకున్న ఇంటిని ఖమ్మం లోని అన్నం పౌండేషన్ కు ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు సుజాతనగర్ మాజీ ఎమ్మెల్యే బొగ్గారపు సీతారామయ్య సతీమణి రుక్మిణమ్మ … ఖమ్మం లోని కీలకమైన ఏరియా అయిన మామిళ్ళ గూడెంలో ఆమె ఉంటున్న 2 కోట్ల విలువైన ఇంటిని అన్నం సేవ పౌండేషన్ కు ఇవ్వడంపై సర్వత్రా ఆమె పట్ల ప్రసంశలు కురిపిస్తున్నారు ప్రజలు .. నిజంగా ఆమె మనసు వెన్న అంటున్నారు . ఒకటి కాదు రెండు కాదు రెండు కోట్ల విలువచేసే ఇంటిని ఒక స్వచ్చంద సంస్థకు ఇవ్వడం మాములు విషయం కాదని అంటున్నారు . గత రెండు దశాబ్దాలుగా ఆ సంస్థ చేస్తున్న సేవ కార్యక్రమాలను గమనించిన ఆమె అనాధలకు తన ఇల్లు ఉపయోగపడాలని అందుకు కేంద్రంగా ఉండాలని ఆమె కోరుకోవటం అభినందనీయం …

మానసిక వ్యాధిగ్రస్థులు, అనాథలు, అభాగ్యులకు అన్నం సేవా ఫౌండేషన్‌ అందిస్తున్న సేవలకు చలించిపోయిన మాజీ ఎమ్మెల్యే సతీమణి ఖమ్మంలోని తన విలువైన ఇంటిని వితరణగా అందించి మానవతను చాటుకున్నారు. పూర్వ ఖమ్మం జిల్లాలోని సుజాతనగర్‌ నియోజకవర్గానికి మొదటి శాసన సభ్యుడిగా బొగ్గారపు సీతారామయ్య సేవలందించారు. ఆయన మరణానంతరం సతీమణి రుక్మిణమ్మ ఖమ్మంలోని మామిళ్లగూడెంలో నివాసముంటున్నారు. ఖమ్మంలో అభాగ్యులకు సేవలందిస్తున్న అన్నం సేవా ఫౌండేషన్‌కు తన వంతు సాయం చేయాలని సంకల్పించారు. పసుపు కుంకుమల కింద పుట్టింటి నుంచి లభించిన, ప్రస్తుతం తాను నివాసం ఉంటున్న ఇల్లు ఫౌండేషన్‌కు చెందేలా వీలునామా రాసి, రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఇటీవల సంబంధిత దస్తావేజులను ఫౌండేషన్‌ ఛైర్మన్‌ అన్నం శ్రీనివాసరావుకు అందజేశారు. ఆ ఇంటి విలువ సుమారు రూ.2 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ‘స్వాతంత్య్ర సమరయోధుడైన ఆమె భర్త సీతారామయ్య బతికున్న రోజుల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన పేరు శాశ్వతంగా జిల్లా ప్రజలకు గుర్తుండాలనే కోరికతోనే ఈ నిర్ణయం తీసుకున్నా. ఫౌండేషన్‌ కొనసాగినంత కాలం నా భర్త జ్ఞాపకార్థం అన్నదానం జరుగుతూనే ఉండాలనేది నా ఆకాంక్ష’ అని రుక్మిణమ్మ ఈ సందర్భంగా తెలిపారు. వచ్చే నెల 7న సీతారామయ్య వర్ధంతి నాడు ఆయన కాంస్య విగ్రహాన్ని అదే ఇంటి ఎదుట ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఫౌండేషన్‌ ఛైర్మన్‌ శ్రీనివాసరావు వెల్లడించారు.

Related posts

ఎయిమ్స్ డైరెక్టర్ గా ఎం శ్రీనివాస్ నియామకం !

Drukpadam

అమ‌రావ‌తిపై రైతుల ప‌క్షాన ఏపీ ప్ర‌భుత్వంపై కోర్టు ధిక్క‌ర‌ణ పిటిష‌న్ వేశాం: బీజేపీ ఎంపీ జీవీఎల్‌

Drukpadam

ఉద్యమం కొనసాగించాలని ఏపీ టీచర్స్ ఫెడరేషన్ నిర్ణయం!

Drukpadam

Leave a Comment