బెంగాల్ ఉప ఎన్నికల్లో చెలరేగిన హింస…బీజేపీ, టీఎంసీ మధ్య ఉద్రిక్తత…
-తనపై టీఎంసీ కార్యకర్తలు కర్రలతో దాడి చేశారని బీజేపీ అభ్యర్థి ఆరోపణ
-మమతా మాటలపై బీజేపీ ఎదురు దాడి …
-మమతా మాటలను ఖండించిన అగ్నిమిత్ర పాల్
-బూతుల దగ్గరకు రాకుండా అగ్నిమిత్ర పాల్ ను వెళ్లిపోవాలన్న టీఎంసీ మద్దతు దార్లు
అసన్సోల్ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్ పర్వంలో మంగళవారం హింసాకాండ చెలరేగింది. ఉప ఎన్నికల్లో తమ బీజేపీ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న అగ్నిమిత్రపాల్‌పై టీఎంసీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారని బీజేపీ ఆరోపించింది.అసన్సోల్ ఉప ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థిగా శత్రుఘ్నసిన్హా పోటీ చేస్తున్నారు.టీఎంసీ కార్యకర్తలు వెదురు కర్రలతో కొట్టారని బీజేపీ అభ్యర్థిని అగ్నిమిత్ర పాల్ ఆరోపించారు. నాడియా అత్యాచార కేసుపై సీఎం మమతాబెనర్జీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్ ఖండించారు.అసన్‌సోల్‌లోని బారబోని పరిధిలోని బూత్ నంబర్ 175, 176లో మంగళవారం ఓటింగ్ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ అభ్యర్థిని అగ్నిమిత్ర పాల్‌ను బూత్‌ల నుంచి వెళ్లిపోవాలని టీఎంసీ కార్యకర్తలు కోరారు.
అసన్‌సోల్ లోక్‌సభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉండగా ప్రధాన పోరు తృణమూల్ కాంగ్రెస్, దాని ప్రధాన ప్రతిపక్షం బీజేపీల మధ్యే ఉంటుందని భావిస్తున్నారు. బీజేపీకి చెందిన అగ్నిమిత్ర పాల్‌పై అసన్‌సోల్‌లో గతంలో బీజేపీతో కలిసి ఉన్న శత్రుఘ్న సిన్హాను టీఎంసీ బరిలోకి దింపింది.బీజేపీని వీడి టీఎంసీలో చేరిన తర్వాత బాబుల్ సుప్రియో అసన్‌సోల్ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. బాలిగంజ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో సీపీఎం అభ్యర్థి సైరా హలీమ్ షాపై బాబుల్ సుప్రియో పోటీ చేస్తున్నారు.