Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మంలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్యపై కొనసాగుతున్న విమర్శలు …ప్రతివిమర్శలు!

ఖమ్మంలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్యపై కొనసాగుతున్న విమర్శలు …ప్రతివిమర్శలు!
-మంత్రి పువ్వాడపై బీజేపీ ,కాంగ్రెస్ ఆరోపణలు
-పువ్వాడ అజయ్ ని వెంటనే బర్తరఫ్ చేయాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
-మంత్రి పువ్వాడపై తీవ్రస్థాయిలో ధ్వజంమెత్తిన నేతలు
-కాంగ్రెస్ కార్యకర్తలను కూడా వేధించారని ఆరోపణ
-పోలీసులు చెంచాగిరీ చేస్తున్నారని ఆగ్రహం
-బీజేపీ ,కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టిన టీఆర్ యస్

ఖమ్మంలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య కు మంత్రి పువ్వాడ అజయ్ కారణమని బీజేపీ ,కాంగ్రెస్ లు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆయన్ను మంత్రివర్గంనుంచి భర్తరఫ్ చేయాలనీ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేయగా ,దీనికి మంత్రి అజయ్ తో పాటు , సీఎం కేసీఆర్ భాద్యత వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు . మంత్రి పువ్వాడతో పాటు ఆ డివిజన్ కార్పొరేటర్ భర్త ప్రసన్న గణేష్ ఆత్మహత్యకు కారణమని తన వాగ్మూలంలో కూడా చెప్పారని బీజేపీ ఆరోపించింది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు లో సైతం పువ్వాడ, పసన్నల పేర్లు పేర్కొన్నారు .

వారి ఆరోపణలను టీఆర్ యస్ తీవ్రంగా ఖండించింది….ఆత్మహత్యకు మంత్రి అజయ్ కారణమని ,బీజేపీ కాంగ్రెస్ లు ఆరోపించడాన్ని అర్థం పర్థంలేని విమర్శలుగా కొట్టి పారేసింది. ఆత్మహత్యకు మంత్రి ఎలా భాద్యత వహించాలో చెప్పాలని ప్రశ్నించింది. ప్రజల్లో పలచబడిపోతున్న ఆ పార్టీలు దిగజారిపోతున్న తమ ప్రతిష్టను కాపాడుకునేందుకు పసలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది .

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పువ్వాడ ఒక సైకో అని అభివర్ణించారు. అతడిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మూడేళ్లుగా ఖమ్మంలో పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని, పువ్వాడకు కొందరు పోలీసులు గులాంగిరీ చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ లను ఆకట్టుకునేందుకు పువ్వాడ అతిగా ప్రవర్తిస్తున్నారని జగ్గారెడ్డి విమర్శించారు.

ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయిగణేశ్ ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఈ ఆత్మహత్యకు కారకుడు పువ్వాడేనంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

ఈ అంశంపై జగ్గారెడ్డి స్పందిస్తూ, సాయిగణేశ్ నుంచి పోలీసులు ఎందుకు వాంగ్మూలం తీసుకోలేదో చెప్పాలని నిలదీశారు. కావాలనే పోలీసులు వాంగ్మూలం తీసుకోలేదని అర్థమవుతోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైనా మంత్రి పువ్వాడ ఇదే తరహాలో వేధింపులకు పాల్పడ్డారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

ఇది ముమ్మాటికీ మంత్రి అజయ్ కుట్రలో భాగంగా జరిగిన ప్రభుత్వ హత్య: బండి సంజయ్

ఖమ్మం జిల్లాలో సాయి నగేశ్ అనే బీజేపీ కార్యకర్త మృతిపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్రస్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతల అరాచకాలు మితిమీరిపోయాయని మండిపడ్డారు. సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కండకావరం కారణంగా ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త సాయి నగేశ్ పై 16 అక్రమ కేసులు బనాయించారని బండి సంజయ్ ఆరోపించారు. పీడీ యాక్ట్ నమోదు చేస్తామని పోలీసులు వేధించడంతో సాయి నగేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని బండి సంజయ్ పేర్కొన్నారు.

స్థానిక మంత్రి అక్రమాలు, ప్రభుత్వ అవినీతిని ప్రస్తావించడమే ఆ యువకుడు చేసిన పాపం అని వ్యాఖ్యానించారు. ఇది ముమ్మాటికీ మంత్రి అజయ్ కుట్రలో భాగంగా జరిగిన ప్రభుత్వ హత్య అని ఆరోపించారు. ముఖ్యమంత్రి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, ఆయనను వదిలే ప్రసక్తే లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు.

Related posts

భట్టి పగటి కలలు కంటున్నారు …. శాసనసభలో కేటీఆర్!

Drukpadam

తెలంగాణకు వైఎస్ కుటుంబం వ్యతిరేకం: కడియం శ్రీహరి!

Drukpadam

బండి సంజయ పాదయాత్ర …అడ్డుకున్న టీఆర్ యస్ కార్యకర్తలు …ఉద్రిక్తత

Drukpadam

Leave a Comment