Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

హాప్ షూట్స్ అత్యంత ఖరీదైన పంట …మార్కెట్లో కిలో రూ.85 వేల

… ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పంట ఇదేనట
  • కూరగాయల పంటలో ఇదొక రకం
  • పాశ్చాత్య దేశాల్లో అధికంగా పండే పంట
  • బీహార్ లో సాగుచేస్తున్న రైతు
  • మార్కెట్లో కిలో రూ.85 వేల ధర
  • ఆహారంగానే కాకుండా ఔషధాలు, బీర్లలోనూ వాడకం
Hop Shoots the most costliest vegetable in the world

… ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పంట ఇదేనట
కూరగాయల పంటలో ఇదొక రకం
పాశ్చాత్య దేశాల్లో అధికంగా పండే పంట
బీహార్ లో సాగుచేస్తున్న రైతు
మార్కెట్లో కిలో రూ.85 వేల ధర
ఆహారంగానే కాకుండా ఔషధాలు, బీర్లలోనూ వాడకం
మన దేశంలో అత్యంత విలువైన వృత్తి.. అధికంగా నష్టాలు మిగిల్చే పని ఏదైనా ఉందా అంటే అది వ్యవసాయం  మాత్రమే. ఆరు గాలం కష్టపడి.. కన్న బిడ్డలా పంటను కాపాడి.. శ్రమించే రైతన్నకు, అతడి పంటకు మార్కెట్‌లో విలువలేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు మూడు పూటలా తిండి దొరకడం లేదనేది అక్షర సత్యం. మన రాజకీయ నాయకులు రైతే రాజు.. రైతు దేశానికి వెన్నెముక అంటూ అతడి వెన్ను విరిచి , కార్పొరేట్‌ సంస్థలకు లాభం చేకూర్చే చేయాలనే చేపడతారు. ఇప్పుడు కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలుకూడా అదే కోవలోకి వచ్చాయనేది రైతు సంఘాలు చేస్తున్న వాదన . అయితే వ్యవసాయం పూర్తిగా నష్టదాయకమేనా అంటూ కాదు. సేంద్రియ ఎరువులను వాడుతూ.. మారుతున్న అవసరాలకు తగ్గట్లుగా పంటలు పండించే వారికి సేద్యం కనక వర్షం కురిపిస్తుంది నిరూపించాడు బీహార్ కు చెందిన ఒక యువరైతు సంప్రాదాయ పంటలతో విసిగిపోయిన ఓ రైతు కొత్త రకం ను పంటను పండించాడు. ప్రస్తుతం అది కేజీ అక్షరాల లక్ష రూపాయలకు అమ్ముడవుతోంది. నమ్మలేకపోయినప్పటికి ఇది పచ్చి నిజం . బీహార్ లోని ఔరంగాబాద్ జిల్లా కరమ్‌దిహ్ గ్రామానికి చెందిన చెందిన అమ్రేష్ సింగ్ అనే 38 ఏళ్ల రైతు సంప్రదాయ పంటలను సాగుచేసి విసిగివేసారి పోయాడు. ఈ క్రమంలో ఈ ఏడాది తన పంథా మార్చిన అమ్రేష్ సింగ్ ‘హాప్ షూట్స్’ అనే కూరగాయను సాగుచేస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కూరగాయగా ‘హాప్ షూట్స్’కు పేరుంది. మన కొనే కూరగాయల మాదిరి దీని ధర కేజీకి పదులు, వందల రూపాయలు ఉండదు. ‘హాప్ షూట్స్’ కిలో ధర కనిష్టంగా 85,000 రూపాయలు ఉంటుంది. డిమాండ్‌ను బట్టి కొన్ని సందర్భాల్లో కిలో లక్ష రూపాయల వరకూ పలుకుతుంది.

ఈ కూరగాయ సాగుకు తన సొంత పొలాన్ని సిద్ధం చేసిన అమ్రేష్ రూ.2.5 లక్షల పెట్టుబడి పెట్టాడు. పంట దిగుబడి కూడా ఆశించిన విధంగానే ఉంది. ఎలాంటి కెమికల్ ఫర్టిలైజర్స్, పురుగు మందులు వాడకుండా అమ్రేష్ ఈ పంటను పండించడం విశేషం. ‘హాఫ్ షూట్స్’ శాస్త్రీయ నామం హ్యుములస్ లుపులస్. ఈ కూరగాయ మొక్కలను వారణాసిలోని ఇండియన్ వెజిటబుల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో అగ్రికల్చర్ సైంటిస్ట్ డాక్టర్ లాల్ పర్యవేక్షణలో పెంచుతున్నారు. అమ్రేష్ కూడా తన పొలంలో ఈ మొక్కలను నాటేందుకు అక్కడి నుంచే తెచ్చాడు. ఈ మొక్కకు పూచే పూలను ‘హాప్ కాన్స్’ అంటారు. బీర్ తయారీలో వీటిని వాడతారు.

ఈ మొక్క కొమ్మలను పొడిగా చేసి మెడిసిన్ తయారీలో వినియోగిస్తారు. అమ్రేష్ సింగ్ ‘హాప్ షూట్స్’ పండిస్తున్న విషయాన్ని సీనియర్ బ్యూరోక్రాట్, ఐఏఎస్ సుప్రియా సాహు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వ్యవసాయంలో ఓ కొత్త ప్రయత్నం చేసిన అమ్రేష్‌ను ఆమె అభినందించారు. అమ్రేష్ ప్రయత్నం ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తుందని, వ్యవసాయంలో రైతులు అధిక మొత్తంలో లాభాలు గడించేందుకు వీలవుతుందని సుప్రియ ఆశించారు. ‘హాప్ షూట్స్’ సాగు చేసిన పొలంలో ఉన్న అమ్రేష్ ఫొటోలను సుప్రియా ట్విట్టర్‌లో షేర్‌ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది.

 

 

 

 

 

 

Related posts

ఎంపీగా మారిన ప‌రుగుల రాణి!.. సంతోషంగా ఉందంటూ మోదీ ట్వీట్‌!

Drukpadam

కోవిడ్ సేవలపై నిరంతర పర్యవేక్షణ-మంత్రి పువ్వాడ.*

Drukpadam

తెలంగాణలో ఎన్నికలు జాతకాల ఆధారంగా నడుస్తున్నాయి: సుప్రీంకోర్టు!

Drukpadam

Leave a Comment