Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మంత్రి పువ్వాడపై బీజేపీ వ్యక్తిగత దాడిని ఖండించిన రాజకీయపార్టీలు ప్రజాసంఘాలు!

మంత్రి పువ్వాడపై బీజేపీ వ్యక్తిగత దాడిని ఖండించిన రాజకీయపార్టీలు ప్రజాసంఘాలు!
-బిజేపి తీరు గర్హనీయమని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ధ్వజం..
-మంత్రి పువ్వాడపై వ్యక్తిగత దాడి సరైంది కాదు.
-ప్రశాంతంగా ఉన్న ఖమ్మంలో కుల, మతాల చిచ్చు రేపుతున్న బిజేపి.
-రౌండ్ టేబుల్ ద్వారా బీజేపీ ,ఆర్ ఎస్ ఎస్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన -వక్తలు, మేధావులు, వివిధ పార్టీల ప్రతినిధులు

ఖమ్మం పట్టణంలో సమైక్యతను, ప్రశాంత జీవనాన్ని విచ్ఛిన్నం చేసే దుష్ట శక్తులకు వ్యతిరేకంగా ఖమ్మం నగరంలోని ఎం ఎస్ టి రోడ్లో గల జిమ్మెర్ ఫంక్షన్ హాల్ నందు రమణరావు అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ వర్గాలు, సిపిఎం , సిపిఐ , సిపిఐ (ఎం ఎల్ ), పీడీఎస్ యూ , రాజకీయ పార్టీలు, మేదావులు, విద్యావేత్తలు, న్యాయవాదులు, ఎస్సీ ,ఎస్టీ , బీసీ , మైనార్టీ, వర్తక సంఘం, వివిధ కుల సంఘాలు, అంబేడ్కర్ సంక్షేమ సంఘం, బార్ అసోeసియేషన్, , గ్రానైట్ అసోసియేషన్, వెండి, బంగారం వ్యాపారుల అసోసియేషన్,టి ఎం జి ఓ ఎస్ యూనియన్, వివిధ హోదాల ప్రజాప్రతినిధులు, సేవలల్ సమితి ప్రతినిధులు తదితరులు పాల్గోన్నారు.

ఖమ్మం పట్టణంలో కొన్ని సంవత్సరాలుగా శాంతియుత వాతావరణంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఎలాంటి జంకు బెంకు లేకుండా సర్వ మత సమానత్వంతో జీవనం కొనసాగిస్తున్నామని అన్నారు

రాజకీయాలు ఏవైనా అది వారి వారి విశ్వాసాల పై ఆధారపడి ఉండేది. కానీ ఈనాడు రాజకీయ ఉనికి కోసం ఎంతటి స్ధాయికైనా దిగజారే పరిస్థితుల్ని నేడు మనం చూస్తున్నామని పేర్కొన్నారు

క్షణికావేశంలో చనిపోయిన వ్యక్తిని అడ్డం పెట్టుకొని దేశ స్థాయి నాయకుల దగ్గర నుండి గల్లీ స్థాయి నాయకులు నేడు మాట్లాడుతున్నారు.. అంటే భవిష్యత్ లో వారి ఆలోచనలు ఎంత దుర్మార్గంగా ఉండబోతునాయో ఈ రోజు మనకు అర్దం అవుతున్నాయి పేర్కొన్నారు

ప్రజల మధ్యన అనేక వైషమ్యాలు, ఘర్షణలు సృష్టించి హింసాకాండ రెచ్చగొట్టి తన వునుకిని కాపడుకునే ప్రయత్నంలో ఎంతటికైనా దిగజారగలదని అనేక ఉదాహరణలు మన కళ్ళ ముందే కనబడుతున్నాయన్నారు

దాదాపు రూ.1600 కోట్ల రూపాయలు నగరానికి తీసుకువచ్చి అనేక సౌకర్యాలు, సదుపాయాల సమకూర్చిన తరువాత ఇప్పుడు బిజేపి వాళ్ళు వచ్చి మెరుగులు అద్దాలని చూస్తూ, అభివృద్ధిని అడ్డుకునేందుకు గోతికాడ నక్కలా ఎదురుచూస్తూ మంత్రి పువ్వాడ పై బురద జల్లి చేసిన అభివృద్ధిని తన ఖాతాలో వేసుకుని పబ్బం గడుపుకోవలని వక్రబుద్దిని నేడు బయటపెట్టారు. అందుకే ఈ రోజు ఖమ్మంపై వాళ్ల కన్ను పడిందని అన్నారు .

ఏళ్ళనాటి వివక్షను చూసిన ఖమ్మం ప్రజలు మంత్రి పువ్వాడ నాయకత్వంలో ఖమ్మం అభివృద్ధిని సాధించుకున్నారు. అది చూసి ఓర్వలేని బీజేపీ ఈ రోజు వాస్తవాలను వక్రీకరించి మాట్లాడుతూ దొంగే దొంగా దొంగా అన్నట్లుగా వ్యవహరించడంపై తీవ్రంగా ధ్వజమెత్తారు .
ఖమ్మం పట్టణ ప్రజల్ని రెచ్చగొట్టి వైషమ్యాలు సృష్టించాలని కలలుకంటుంది. ఈ సమయంలో రాజకీయాలకు అతీతంగ ఖమ్మం ప్రశాంతతను కాపడుకోవాల్సిన అవసరం ఉందని వక్తలు పేర్కొన్నారు

కుట్రలతో, కుతంత్రాలతో ప్రజల్ని వంచించి రాజకీయ స్వార్థంతో యువకుల్ని ఆత్మహత్య వైపు ప్రేరేపిస్తున్న స్వార్థపరుల కుట్రలను పసిగట్టి వాళ్ల ఎత్తుగడలను చిత్తుచేసి ఖమ్మం అంటే అభివృద్ధికి ప్రతిబింబం అని, ఖమ్మం అంటే కుల, మత విశ్వాసాలకు విలువనిచ్చే లౌకిక ప్రజాతంత్ర విలువల పరిరక్షణకు కేంద్రం అని చాటి చెప్పాల్సిన అవసరం అనివార్యమైంది అభిప్రాయపడ్డారు .

ఖమ్మం పట్టణంలో సమైక్యతను, ప్రశాంత జీవనాన్ని విచ్ఛిన్నం చేసే దుష్ట శక్తులకు వ్యతిరేకంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు బిజేపి, ఆర్ ఎస్ ఎస్ పై తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు.

Related posts

గవర్నర్​ తమిళిసైపై సీఎం కేసీఆర్​ సంచలన వ్యాఖ్యలు!

Drukpadam

కర్ణాటకలో బలిజలు రాజకీయంగా ఎదగాలంటే కేసీఆర్ వెంట నడవాలి …ఎంపీ వద్దిరాజు!

Drukpadam

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుపై జిల్లా కలెక్టర్ కు జనసేన ఫిర్యాదు!

Drukpadam

Leave a Comment