Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేటీఆర్ వ్యాఖ్యలు శుద్ధ అబద్ధం: కేంద్రమంత్రి జితేంద్రసింగ్!

కేటీఆర్ వ్యాఖ్యలు శుద్ధ అబద్ధం: కేంద్రమంత్రి జితేంద్రసింగ్!
-మోదీ పర్యటనలో కేసీఆర్ పాల్గొనకుండా చూడాలంటూ పీఎంవో నుంచి సమాచారం అందిందన్న కేటీఆర్
-అలాంటి సమాచారమేదీ పంపలేదన్న కేంద్రమంత్రి
-కేసీఆర్ పాల్గొనడం లేదంటూ సీఎంవోనే సమాచారం ఇచ్చిందని వివరణ

ప్రధాని మోడీ పర్యటనలో సీఎం కేసీఆర్ పాల్గొనలేదు . దీనిపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. స్వయంగా ప్రధాని రాష్ట్రానికి వస్తుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఉన్న కేసీఆర్ పాల్గొనకపోవడంపై సీఎంఓ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. దానిసారాశం ఏమిటి అంటే సీఎం కేసీఆర్ కు జ్వరం వచ్చినందున ప్రధాని పాల్గొనే ముచ్చింతల్ లోని సమంత మూర్తి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రాలేకపోతున్నట్లు ,ప్రధాని రాకకు ముందు రోజు వరకు బాగానే ఉన్న కేసీఆర్ కు ఉన్నట్లు ఉంది ప్రధాని వచ్చే రోజే జ్వరం రావడం యాదృచ్చికమే అయినా అనుమానాలు రేకెత్తించింది. అంతకుముందు నుంచే ఉన్న కేంద్ర రాష్ట్రాల మధ్య ఎడబాటు ప్రధాని మోడీ హైద్రాబాద్ వచ్చినప్పుడు మర్యాద పూర్వకంగానైనా కేసీఆర్ కలవకపోవడం వారి మధ్య మరింత దూరం పెంచింది. దీనిపై కేటీఆర్ చేసిన ప్రకటన ఇప్పుడు మరింత దుమారానికి కారణమైంది.

ప్రధానమంత్రి మోదీ హైదరాబాద్ పర్యటనలో కేసీఆర్ పాల్గొనకుండా చూడాలంటూ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఓ సందేశం వచ్చినట్టు మంత్రి కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి జితేంద్రసింగ్ ఖండించారు. ఇది పూర్తిగా అవాస్తవమని కొట్టిపడేస్తూ ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం అలాంటి సందేశం ఏదీ పంపలేదన్నారు. నిజానికి మోదీ హైదరాబాద్ పర్యటనలో కేసీఆర్ పాల్గొంటారనే అనుకున్నామని, అయితే, ఆయన ఆరోగ్యం బాగాలేకపోవడంతో హాజరు కాలేకపోతున్నట్టు సీఎం కార్యాలయమే పీఎంవోకు సమాచారం అందించిందని జితేంద్రసింగ్ తెలిపారు.

కాగా, ఇదే విషయంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా స్పందించారు. అనారోగ్యం కారణంగానే మోదీ పర్యటనకు తాను అందుబాటులో ఉండడం లేదని అప్పట్లో కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే, కేటీఆర్ మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడారని అన్నారు.

Related posts

ప్రణాళిక మేరకే తప్పించారు… శాఖమార్పుపై కిరణ్ రిజిజు స్పందన ….

Drukpadam

కొనసాగుతున్న ఆఫ్ఘన్ సంక్షోభం …ప్రపంచదేశాలు సమాలోచనలు!

Drukpadam

కర్నూల్ లో అద్భుతమైన హైకోర్టు …10 కి.మీ కనిపిస్తుంది..బుగ్గన

Drukpadam

Leave a Comment