Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

ఎలుకల నుంచే ఒమిక్రాన్: అమెరికా పరిశోధకులు…

ఎలుకల నుంచే ఒమిక్రాన్: అమెరికా పరిశోధకులు
-ఉత్పరివర్తనాల వల్ల ఒమిక్రాన్ పుట్టలేదు!
-జంతువుల్లో వేల సంఖ్యలో కరోనా వైరస్ ఉత్పరివర్తనాలు
-ప్రాణాంతక వేరియంట్‌గా మారేందుకు అత్యధిక అవకాశాలున్నాయన్న శాస్త్రవేత్తలు
-జంతువులు కొత్త వేరియంట్లకు రిజర్వాయర్లుగా ఉంటాయంటున్న నిపుణులు

నిన్నటివరకు చైనా వల్లనే కరోనా ప్రపంచంలో జడలు ఇప్పిందని ,అక్కడే పుట్టిందని లేదు…లేదు పుట్టించారని చెప్పిన అమెరికా పరిశోధనలు అవినిజంకాదని చెబుతుండటం ఆశ్చర్యం కల్గిస్తుంది. కరోనా తో లక్షలాది మంది చనిపోయారు . కోట్లాది మందికి వ్యాధి సోకింది. ఏవో ఒకటి అరా చిన్న దేశాలు తప్ప మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాలను అతలాకుతలం చేసిన కరోనా మొదట చైనా లోని వ్యుహాన్ ల్యాబ్ లో కృత్రిమంగా తయారు చేశారని అక్కడ నుంచి దేశ దేశాలకు వ్యాపించిందనని ప్రచారం జరిగింది. తరువాత చైనాలోని గబ్బిలాల వాళ్ల ఈ వ్యాధి వచ్చిందని వార్తలు వెలువడ్డాయి. అందువల్ల దోషిగా చైనాను నిలబెట్టాలని అమెరికా దాని మిత్ర దేశాలు ప్రచారం ప్రారంభించాయి. ఒక సందర్భంలో చైనా ఎంత మొత్తుకున్నా వినకుండా చైనాకు కరోనా ప్రపంచానికి అందించిన విలన్ గా చిత్రీకరించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కరోనా ఎలుకల నుంచి పుట్టి ఉండవచ్చునని ఇంకా నిర్దారణ కానీ పరిశోధన ఒకటి అమెరికా పరిశోధకులు తమ పరిశోధనల ద్వారా ప్రపంచానికి వివరించారు . అయితే ఇది ఇంకా నిర్దారణ కావాల్సి ఉంది.

కరోనా మూడో దశలో ప్రపంచాన్ని చుట్టేసిన ఒమిక్రాన్ వేరియంట్ ఎలా పుట్టుకొచ్చిందన్న ప్రశ్నకు అమెరికా పరిశోధకులు తాజాగా వెల్లడించిన వివరాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ వేరియంట్ రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న వ్యక్తిలో ఉత్పరివర్తనాల వల్ల పుట్టుకొచ్చింది కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఎలుకల నుంచే బహుశా ఇది మానవుల్లో ప్రవేశించి ఉండొచ్చని అన్నారు.

జంతువుల్లో కరోనా వైరస్ వేల సంఖ్యలో ఉత్పరివర్తనాలకు గురవుతూ మానవుల్లో వేగంగా వ్యాప్తి చెందడమే కాకుండా, అత్యంత ప్రాణాంతక వేరియంట్‌గా మారేందుకు అవకాశాలు ఉన్నట్టు గుర్తించారు. కరోనా వ్యాప్తిలో జంతువుల పాత్రను విస్మరించడానికి లేదని, అవి కొత్త వేరియంట్లకు రిజర్వాయర్లుగా పనిచేస్తాయని అమెరికా నిపుణులు చెబుతున్నారు.

Related posts

వ్యాక్సిన్ల కోసం రాష్ట్రాలు కొట్టుకునే దారుణ పరిస్థితులు తలెత్తాయి: కేజ్రీవాల్…

Drukpadam

బాగ్దాద్ లో ఘోరప్రమాదం… ఆక్సిజన్ ట్యాంకర్ పేలి 82 మంది దుర్మరణం

Drukpadam

ధైర్యానికి ప్రతిరూపంలా కనిపించిన ఆ అమ్మాయిని కరోనా కబళించింది!

Drukpadam

Leave a Comment