Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రైతు ఉద్యమనేత రాకేశ్‌ తికాయత్ కాన్వాయ్‌పై రాజస్థాన్ లో దాడి

Tikat Convoy was attacked in Rajasthan

రైతు ఉద్యమనేత రాకేశ్‌ తికాయత్ కాన్వాయ్‌పై రాజస్థాన్ లో దాడి
-బీజేపీ దుండగుల పనే అని తికాయత్‌ ఆరోపణ
-ఖండించిన రైతు సంఘాలు
-నిరసనగా ఘాజీపూర్‌ వద్ద రోడ్డు దిగ్బంధం
కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) నేత రాకేశ్‌ తికాయత్ ‌ కాన్వాయ్‌పై శుక్రవారం దాడి జరిగింది. రాజస్థాన్‌లోని అల్వార్‌ జిల్లా తాతార్‌పూర్‌ గ్రామంలో ఈ ఘటన జరిగింది. తికాయత్‌ రాజస్థాన్‌లోని హర్సోరా ప్రాంతంలో రైతు ఉద్యమ మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. అక్కడి నుంచి బన్సూర్‌కు బయలుదేరారు. మార్గమధ్యంలో గుర్తు తెలియని దుండగులు ఆయన క్వాన్యాయ్‌పై దాడికి దిగారు. ఈ ఘటనలో ఆయన కారు స్వల్పంగా ధ్వంసమైంది. ఇది కచ్చితంగా బీజేపీ దుండగుల పనే అని రాకేశ్‌ తికాయత్‌ ఆరోపించారు. కారు ధ్వంసమైనట్లు చూపుతున్న వీడియోని ట్విటర్‌లో పంచుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వ్యాఖ్యానించారు.
మరోవైపు ఈ ఘటనను ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులు తీవ్రంగా ఖండించారు. దీనికి నిరసనగా ఢిల్లీ-ఉత్తర్‌ప్రదేశ్‌ రహదారిపై ఘాజీపూర్‌ వద్ద రోడ్డును దిగ్బంధించారు. దీంతో భారీ స్థాయిలో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు రైతులను చెదరగొట్టి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

Related posts

ఖమ్మం లో మంత్రి అజయ్ పై ధ్వజమెత్తిన షర్మిల!

Drukpadam

మెత్త బడ్డ సిద్దు రాజీనామా వెనక్కి …? సీఎం తో భేటీ …

Drukpadam

అప్పులు చేసుకుంటూ పోతే రాష్ట్రం దివాళా తీస్తుంది :చంద్రబాబు!

Drukpadam

Leave a Comment