Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాహుల్ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన రద్దు …

రాహుల్ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన రద్దు …
తెలంగాణలో రాహుల్‌గాంధీ పర్యటన.. ఎప్పుడు? ఎక్కడ?.. షెడ్యూల్ ఇదే!
రేపు హైదరాబాద్ చేరుకోనున్న రాహుల్
వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో రైతు సంఘర్షణ సభ
రేపు రాత్రికి తాజ్‌కృష్ణలో బస
7న మాజీ సీఎం సంజీవయ్యకు నివాళి
గాంధీభవన్‌లో నేతలతో భేటీ
అనంతరం ఢిల్లీకి పయనం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండురోజుల తెలంగాణ పర్యటనకు హైద్రాబాద్ వస్తున్నారు . అయితే ముందుగా అనుకున్నట్లు వరంగల్ లో రైతు సంఘర్షణ బహిరంగసభలో పోల్గోఉంటారు .అక్కడ నుంచి హైద్రాబాద్ వచ్చి బస చేస్తారు .అయితే ఉస్మానియా యూనివర్సిటీ పార్టీటించాలని అక్కడ విడీర్థులతో ముచ్చటించాలని అనుకున్న అది సాధ్యపడలేదు …చివరకు కాంగ్రెస్ హైకోర్టు ద్వారా పర్మిషన్ పొందాలని చాల తిప్పలపడ్డ హైకోర్టు సైతం రాహుల్ ఉస్మానిస్సాయ పర్యటన కు నో చెప్పడంతో ఆ పర్యటన రద్దు చేసుకున్నారు .

రెండు రోజల పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు (శుక్రవారం) ప్రత్యేక విమానంలో హైదరాబాద్ రానున్నారు. సాయంత్రం 4.50 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి రాహుల్ చేరుకుంటారు. 5.10 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్‌లో వరంగల్ బయలుదేరి 5.45 గంటలకు వరంగల్‌లోని గాబ్రియెల్ స్కూలుకు చేరుకుంటారు. 6.05 గంటలకు వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో రాహుల్ పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు రోడ్డు మార్గం ద్వారా వరంగల్ నుంచి బయలుదేరి రాత్రి 10.40 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం రాత్రికి బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణలో బస చేస్తారు.

మరుసటి రోజైన శనివారం 12.30 గంటలకు తాజ్‌కృష్ణ నుంచి బయలుదేరి సంజీవయ్య పార్క్‌కు చేరుకుంటారు. 12.50-1.10 మధ్య దివంగత మాజీ ముఖ్యమంత్రి సంజీవయ్యకు నివాళులు అర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 1.30 గంటలకు గాంధీ భవన్ చేరుకుంటారు. 2.45 గంటల వరకు పార్టీ నేతలతో సమావేశం అవుతారు. అనంతరం మెంబర్‌షిప్ కోఆర్డినేటర్లతో రాహుల్ ఫొటోలు దిగుతారు. సాయంత్రం నాలుగు గంటలకు గాంధీ భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 5.50 గంటలకు ఢిల్లీకి బయలుదేరడంతో హైదరాబాద్‌లో ఆయన పర్యటన ముగుస్తుంది.

Related posts

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ఉక్కిరిబిక్కిరి పలువురు నేతలు టీఎంసీ వైపు చూపు…

Drukpadam

రాజీనామా చేసి దళితుడికి ముఖ్యమంత్రి ఇవ్వు …కేసీఆర్ కు షబ్బీర్ అలీ సలహా!

Drukpadam

సానుభూతి కోసమే ఈటల చిల్లర ఆరోపణలు చేస్తున్నారు: మంత్రి గంగుల!

Drukpadam

Leave a Comment