Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీఆర్ యస్ లో ఎమ్మెల్సీల లొల్లి…

టీఆర్ యస్ లో ఎమ్మెల్సీల లొల్లి…
-ఎవరికీ ఛాన్స్ …ఆశక్తి రేపుతున్న చర్చ
-ఉన్న సీట్లు 6 చాంతాడంత లిస్ట్
– పరిశీనలో పలువురిపేర్లు
వచ్చే జూన్ నెలలో 6 గురు ఎమ్మెల్సీలు రిటైర్ అవుతున్నారు. స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన మరో 12 మంది 2022 జనవరి లో రిటైర్ కానున్నారు. వీరంతా టీఆర్ యస్ కు చెందిన వారు కావడం విశేషం . ఖాళీ అయ్యే వన్ని ఎమ్మెల్యేల కోట నుంచి సంబందించినవి . ఏ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికకు సరిపడా ఎమ్మెల్యేలు లేరు. కాంగ్రెస్ కు చెందిన 13 మంది టీఆర్ యస్ తీర్ధం పుచ్చుకోవడం తో ఇప్పడు ఆపార్టీకి ఆరుగురు మంత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. అందువల్ల పెద్దగా ఇబ్బంది లేకుండా టీఆర్ యస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైయ్యే అవకాశం ఉంది. జూన్ నెలలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , ఆకుల లలితా, కడియం శ్రీహరి , ఫిరాదుద్దిన్ ,నేతి విద్యాసాగర్ , బోడకుంట వెంకటేశ్వర్లు , రిటైర్ కానున్నారు. వీరిలో తిరిగి ఎవరికీ ఛాన్స్ ఇస్తారు . ఎవరికీ ఇవ్వరు అనేదానిపై సర్వత్రా ఆశక్తి నెలకొన్నది . ఆశావావులు కూడా ఎక్కువగానే ఉన్నారు. అన్నిప్రాంతాలు సామాజిక వర్గాల పొందికలు కూడా పరిశీలనకు రానున్నాయి. అందువల్ల అనేక మంది ఉన్నప్పటికీ అదృష్టవంతులు ఎవరు? ఎవరిని ఎంపిక చేస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. అనేకమంది ఉన్నా, ఖాళీలు అయ్యేది ఆరుగురే . వారిలో మండలి చైర్మన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డికి తిరిగి ఆవకాశం ఉంటుందని సమాచారం . ఇక నేతి విద్యాసాగర్, బోడకుంట వెంకటేశ్వర్లు , ఫరీదుద్దీన్ లకు తిరిగి నియమిస్తారు లేదా ? అనేదానిపై అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. ఆకుల లలితాకు ఛాన్స్ అనుమానమే అంటున్నారు. ఆకుల లలితకు అవకాశం లేకపోతె గుండు సుధారాణి పేరు పరిశీలించవచ్చు . కేసీఆర్ మదిలో ఎవరున్నారనేది చివరివరకు తెలియదు. అందువల్ల తమకే గ్యారంటీ అని చెప్పే పరిస్థితి లేదు. అనేక మంది మాత్రం ఎమ్మెల్సీ సీటు కోసం ఎదురు చూస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , వరంగల్ లో గుండు సుధారాణి , మాజీమంత్రులు పట్నం మహేందర్ రెడ్డి , జోగురామన్న , తదితర సీనియర్ నేతలతో పాటు మరికొందరి పేర్లను పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఎన్నికల సందర్భంగా కొందరికి ఎమ్మెల్సీ టిక్కెట్లు ఇస్తామని హామీ నిచ్చారు. వారు కూడా తమకు ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ టిక్కెట్లు ఇవ్వకపోతారా ? అనే నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే కొందరు నేతలు బీజేపీ వైపు చూస్తుందనున వారిని బుజ్జగించటం ద్వారా పార్టీలో కొనసాగేలా చేస్తున్నారు. మంత్రి వర్గంలో కూడా కొన్ని మార్పులు ఉండవచ్చుననే అభిప్రాయాలూ ఉన్నాయి. నాగార్జున సాగర్ ఉపఎన్నికల అనంతరం వాటి ఫలితాల ఆధారంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. అయితే జిల్లాలలో ఉండే పొందికలు కుల సమీకరణాలు అభ్యర్థుల ఎంపికలో కొలమానంగా ఉంటాయి. కడియం శ్రీహరి సీనియర్ నేత మాజీ మంత్రి , పైగా ఎస్సీ సామాజికవర్గంకు చెందిన వారు. పైగా విద్యావంతుడు. ఇటీవల కాలంలో ఆయనకు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య కు మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఇక ఖమ్మం జిల్లాలో పువ్వాడ అజయ్ మంత్రిగా ఉన్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కు ,అజయ్ కు మధ్య సంబంధాలు సరిగా లేవు. అదే విధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కు అజయ్ మధ్య సంబంధాలు అంతంత మాత్రమే . కేటీఆర్ తో అజయ్ , పొంగులేటి ఇద్దరు మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. మొన్న ఖమ్మం వచ్చిన సందర్భంగా వారిని హెలికాఫ్టర్ లో తీసుకొని పోయారు. వారి మధ్య దూరాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి. నల్లగొండ నుంచి గుత్తా కె ఛాన్స్ ఉంటుందనే దానిలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఎం ఐ ఎం కు ఆవకాశం ఇస్తారా ? ఫరీదుద్దీన్ కు చెస్ లేకపోతె మరొక ముస్లిం మైనార్టీ ని ఏమికా చేసే ఆవకాశం ఉంది. దీనిపై ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభం అయింది. అదృష్టవంతులు ఎవరో తేలాలి మరి !!!

Related posts

!మోడీ ,కేసీఆర్ బంధం పై రేవంత్ రెడ్డి ఆశక్తికర మాటలు …

Drukpadam

బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే:కపిల్‌ సిబల్‌…

Drukpadam

ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో చంద్రబాబుకు ఘన స్వాగతం..!

Drukpadam

Leave a Comment