నారాయణ ఏమైనా విప్లవకారుడా?.. ఆయన అరెస్ట్‌పై అంత గగ్గోలు ఎందుకు?: సజ్జల
-ప్రశ్నా పత్రాల లీకేజీని ప్రభుత్వ వైఫల్యంగా చూపారన్న సజ్జల
-మరి ఆ వ్యవహారంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవద్దా? అని ప్రశ్న
-100 శాతం ఉత్తీర్ణత కోసమే కొన్ని విద్యా సంస్థల అక్రమాలన్న సజ్జల
నారాయణ విద్యాసంస్థలకు సంబంధించైనా పేపర్ లీకేజ్ కేసులో నిన్న అరెస్ట్ అయి బెయిల్ పై వచ్చిన నారాయణ విషంలో అటు తెలుగు దేశం ఇటు ప్రభుత్వం మధ్య పెద్ద వార్ నడుస్తుంది. పేపర్ లీకేజ్ నారాయణకు సంబంధం ఉందా లేదా ? నారాయణ విద్యాసంస్థలకు ఇప్పుడు నారాయణ చైర్మన్ గా ఉన్నదా లేదా ? అనే విషయంలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి నారాయణ అరెస్ట్ పై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తుంది. ఆయన ఏమైనా విప్లవ కారుడా ? అంటూ ఫైర్ అయ్యారు .
టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో అరెస్టయిన మాజీ మంత్రి పొంగూరు నారాయణ వ్యవహారంపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణ ఏదో విప్లవకారుడైనట్లు ఆయన అరెస్ట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు అంత గగ్గోలు చేయడం ఏమిటంటూ సజ్జల మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం నారాయణ అరెస్ట్, అనంతర పరిణామాలపై మీడియాతో మాట్లాడిన సందర్భంగా సజ్జల ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రశ్నా పత్రాల లీకేజీని టీడీపీ నేతలు ప్రభుత్వ వైఫల్యంగా అభివర్ణించిన విషయాన్ని గుర్తు చేసిన సజ్జల.. అలాంటప్పుడు తమ ప్రభుత్వం ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవద్దా? అంటూ ప్రశ్నించారు. 100 శాతం ఉత్తీర్ణత కోసమే కొన్ని విద్యా సంస్థలు పేపర్ లీక్, మాల్ ప్రాక్టీస్ వంటి అక్రమాలకు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు. ఇందులో భాగంగానే నారాయణ అరెస్ట్ అయ్యారని సజ్జల చెప్పారు.