Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సాగర్ కాలువలో అబ్బుర పరిచిన దృశ్యాలు …100 మందితో 20 కి.మీ ఈత ర్యాలీ…

సాగర్ కాలువలో అబ్బుర పరిచిన దృశ్యాలు …100 మందితో 20 కి.మీ ఈత ర్యాలీ

ఖమ్మం జిల్లాలో అపురూపఘట్టం

తెల్ధార్ పల్లి నుంచి రమణగుట్ట వరకు

చూడముచ్చటగా సాగిన ఈత ర్యాలీ

ఉత్సాహంగ పాల్గొన్న యువతి,యువకులు

ఖానాపురం స్వీమ్మింగ్ అసోషియోషన్ ఆధ్వర్యంలో

 

పైన చూస్తున్న దృశ్యాలు ఎక్కడో ప్రపంచ పోటీలు కాదు …. బ్రిటిష్ కాలువ అసలు కాదు …. గజ ఈతగాళ్లు అంతకన్నా కాదు … వీరికి మెడల్స్ ఏమి రాలేదు … కాని అంతకన్న గొప్పగా సాగర్ ఎడమ కాల్వలో వీరు ఈదారు…. ఒకరు ఇద్దరు కాదు … ఏకంగా 100 మంది….. ఒకటి రెండు కి.మీ కాదు …. 20 కి.మీ సాహసం చేశారు. ఇందులో 75 వయసు కలిగిన వడ్లమూడి శేషయ్య తో పాటు 3 సంవత్సరాల చిన్నారి పాల్గొన్నారు. ఇది అపురూప ఘట్టంగా నిలిచింది.చూపరులను అబ్బురపరిచింది . ఎక్కడో జరుగుతున్నా ఈత పోటీలను గురించి ఇంటుంటాం. ఖమ్మం సమీపంలోని తెల్దారుపల్లి వద్ద గల సాగర్ ఎడమ కాలువ నుంచి ఖమ్మం లోని రమణగుట్ట ప్రాంతం వరకు జరిగిన ఈ ఈత ర్యాలీ చూపరులను ఎంతగానో ఆకర్షించింది. ఈ పోటీలలో జాతీయ జెండాను కూడా ప్రదర్శించారు. ప్రతి సంవత్సరం ఇదే ఇదంగా తాము ఖానాపురం హావేలి ఈత అసోసియేషన్ ఆధ్వరంలో పోటీలు నిర్విస్తున్నా తక్కువదూరం నిర్విస్తామని అసోసియేషన్ భాద్యులు కోదాటి గిరి తెలిపారు. ఈ ప్రదర్శన అనంతరం దొండపాటి శ్రీనుతో కలిసి ఆయన మాట్లాడుతూ తాము అనేక మందికి ఉచితంగా ఈత నేర్పుతున్నామని దీనిని కొనసాగించేందుకే మరింత దూరం ఈదాలనే ఉద్దేశంతో 20 కి.మీ టార్గెట్ గా ఎంచుకున్నామని అన్నారు.ఈ పోటీలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదులు తెలిపారు. కార్యక్రమంలో తమ్మినేని వెంకటేశ్వరరావు,జంగాల రవి ,సునీల్ , గోగుల వీరయ్య, బిల్లగిరి వెంకటేశ్వరరావు , సుందరిలాల్ , పాపారావు , వీరస్వామి , చందర్ రావు , అమర్ , తదితరులు పాల్గొన్నారు.

Related posts

విశాఖ ఎంపీ పై పవన్ కళ్యాణ్ చిందులు …

Ram Narayana

రష్యా సింగిల్‌ డోసు స్పుత్నిక్‌ లైట్‌ వ్యాక్సిన్‌ సామర్థ్యం 79.4 శాతం!

Drukpadam

అంతర్జాతీయ ప్రయాణికులపై కీలక నిబంధనను ఎత్తివేసిన కేంద్రం!

Drukpadam

Leave a Comment