Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పత్రికా రంగంపై విమర్శలకు ప్రభుత్వాలే కారణం

TUWJ (IJU) ఖమ్మం జిల్లా మూడవ మహాసభలో ప్రసంగిస్తున్న IJU అధ్యక్షులు కె.శ్రీనివాసరెడ్డి

పత్రికా రంగంపై విమర్శలకు ప్రభుత్వాలే కారణం
-కేంద్ర వేతన చట్టాలను అమలు చేయాలి
-పత్రికా స్వేఛ్చ యాజమాన్యాల స్వేఛ్చగా మారింది
-ఐజెయు జాతీయ అధ్యక్షులు కె శ్రీనివాస్ రెడ్డి

ఖమ్మం:-
జర్నలిస్తుల పై అవినీతి విమర్శలురావడానికి ప్రభుత్వాలే కారణమని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజెయు) జాతీయ అధ్యక్షులు కె శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయపడ్డారు.వ్యవస్ధలో నాల్గవ స్ధంభంగా న్న ప్రతి జర్నలిస్ట్ పై మోయలేనంత నిందలు మోపుతున్నారని ఆయన అన్నారు.
టియుడబ్ల్యుజె ఐజెయు ఖమ్మం జిల్లా మూడవ మహాసభ శుక్రవారం ఖమ్మం రూరల్ మండలం లోని టి సి వి రెడ్డి ఫంక్షన్ హాల్లో అమర్ నాథ్ ప్రాంగణంలో జిల్లా అధ్యక్షులు నర్వనేని వెంకట్రావ్ అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభలను కె శ్రీనివాస్ రెడ్డి జ్యోతి ప్రజల్వన చేసి ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడ్తూ జర్నలిజంపై ప్రజల్లో,అధికారుల్లో,రాజకీయనేతల్లో ఉన్న భావనలను గమనంలోకి తీసుకున్నప్పుడు అందరివేలు జర్నలిస్టుల వైపే ఎందుకు చూపుతున్నారనే అంశంపై పాత్రికేయులు కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం నేడు ఏర్పడిందన్నారు . సద్వివిమర్శను స్వీకరించే ధైర్యం లేకపోతే ఈ వ్రతిలో కొనసాగలేమన్నారు.అయితే మిగిలిన మూడు స్ధంబాలైన కార్యనిర్వహక ,న్యాయవ్యవస్ధలో అవినీతి లేదా అంటే ఖచ్చితంగాఉందని కాని అందరి వేలు జర్నలిస్టులవైపు ఎందుకు చూపిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.ఇది ఉద్దేశ్యపూర్వకంగా ,వ్యూహాత్మకంగా జరుగుతున్న కుట్ర అని ఆయన అన్నారు
జర్నలిస్టుల కోసం కేంద్ర ప్రభుత్వం వేతన చట్టాన్ని తీసుకోచ్చిందని దాని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదని , ఈచట్టం అమలవుతే జర్నలిస్టులపై ఉన్న నింద పడే అవకాశం ఉండదన్నారు.ఇటివల కార్మిక శాఖ అధికారిని జర్నలిస్టుల వేతన చట్టం అమలు శాతం ఎంత అని అడిగితే 22శాతం మాత్రమే అమలవుతుందని సమాదానం ఇచ్చారని ఆయన అన్నారు.వేతన చట్టాలు అమలు కాకపోతే జర్నలిస్టులు ఏం తిని బ్రతకాలని ఆయన ప్రశ్నించారు.అందుకేజర్నలిస్టులపై వచ్చే నిందలకు ప్రభుత్వాలే కారణమన్నారు.మరోవిధంగా పత్రికాయజమాన్యాలు కూడా కారణమవుతున్నాయన్నారు.మీడియా స్వేచ్చకు రాజ్యంగంలో ఏమి పొందపర్చలేదా అంటే లేదనాలి దీనికి కారణం కూడా ఉందన్నారు. మీడియా అంటే ప్రజల భావాలను ప్రతిబింబించేలా వార్తలు రాసేది అలాంటి దాని విషయంలో రాజయంగంలో స్వేఛ్చ కోసం పొందు పర్చితే మళ్ళీ దానిపై అజమాయిషి చేసేందుకు మరోవ్యవస్ధ్యను ఏర్పాటు చేయాల్సి వస్తుందని చేయలేదన్నారు. అలా చేస్తే అధికారంలో పార్టీలు దీనిని దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుందని రాజ్యంగ నిపుణులు ఆలోచించినట్లు ఉందన్ని అయితే
ప్రాథమిక హక్కుల్లో చేర్చారని ఆయన తెలిపారు. ఆర్టికల్ 119 లో భావ ప్రకటన స్వేఛ్చ అంటే ప్రజల మనోభావాలు ప్రతిబింబించే వార్తలు రాయలన్నారు. అవినీతి రోపణలు రాకుండా మనం మారాలన్నారు.1954.56లో వర్కింగ్ జర్నలిస్టు యాక్ట్ తెచ్చారని పేర్కొన్నారు. కేంద్రం 40 కార్మిక చట్టాలను వర్కింగ్ జర్నలిస్టుల చట్టాన్ని రద్దు చేసిందన్నారు. కొత్తగా 40 మంది సభ్యులతో కమిటీ వేశఆరని సబ్ కమిటీ సిఫారస్ లమేరకు అమల్లోకి తెస్తామమంటున్నారని ఆయన అన్నారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని శ్రీనివాస్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మాట్లాడ్తూ జర్నలిస్టుల ఇళ్ళ సమస్య పరిష్కరానికి తన వంతుగా క్రషి చేస్తానని హామి ఇచ్చారు.జర్నలిస్టులకు రాజీవ్ స్వగ్రహ ఇళ్ళ కేటాయింపు తోపాటు జర్నలిస్టుల హెల్త కార్డుల విషయాన్ని తాను ముఖ్యమంత్రి ద్రష్టికి తీసుకేళ్తానన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలు విద్యా,వైద్య సౌకర్యాలు ప్రభుత్వ సంస్ధలో పొందేవిధంగా ప్రజలను పాత్రికేయులు చైతన్యవంతులను చేయాలని కోరారు.మారుమూల ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వహాయంలో విద్యా,వైద్య రంగంలో విప్లవాత్మక మార్పలు వచ్చాయని వాటిని ప్రజలు సద్వీనియోగం చేసుకునే విధంగా వార్త కధనాలు రావాలని కోరారు.దీని వల్ల ప్రజల ఆర్ధిక భారం నుంచి కాపాడినవారంఅవుతామని ఆయన అభిప్రాయపడ్డారు.


సి ఎల్ పి నేత మల్లు భట్టి విక్రమార్క్ మాట్లాడ్తూ జర్నలిస్టుల సమస్యల సాధనకు తన వంతుగా క్రషిచేస్తామన్నారు. ఇళ్ళ స్ధలాలు,హెల్త కార్డులు,అక్రిడేషన్ కార్డులకోసం జర్నలిస్టులు చేసే ఉద్యమంలో తాము కూడాపాలు పంచుకుంటామన్నారు.


ఎమ్మెల్సీ జిల్లా టిఆర్ ఎస్ అధ్యక్షులు తాతా మధు మాట్లాడ్తూ ఇళ్ళ స్ధలాల కేటాయింపు విషయాన్ని ముఖ్యమంత్రి ద్రష్టికి తీసుకేళ్తానని హామి ఇచ్చారు.


టియుడబ్ల్యుజె ఐజెయు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రాంనారాయణ మాట్లాడ్తూ జర్నలిస్టుల సమస్యలపై భవిష్యత్తులో జరిగే ఉద్యమాల్లో జర్నలిస్టులంతా కీలకంగా పాల్గొన్నాలని పిలుపునిచ్చారు.


ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు,నగర మేయర్ పునుకొల్లు నీరజ,సుడా ఛైర్మన్ బచ్చు విజయ్ కుమార్,ఐజెయి జాతీయ కార్యవర్గ సభ్యులు దాసరి క్రష్ణారెడ్డి,రాష్ట్ర చిన్నపత్రికల సంఘం అధ్యక్షులు యూసుఫ్ బాబు, బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర్ రావు,సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ లు ప్రసంగించగా ,డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్,టియుడబ్ల్యుజె జిల్లా కార్యదర్శి ఖాదార్ బాబ,నేషనల్ కౌన్సిల్ సభ్యులు రవీంధ్ర శేషు,బుచ్చిరెడ్డి,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వనం వెంకటేశ్వర్లు, మాటేటి వేణుగోపాల్,నగర కమిటి అధ్యక్ష కార్యదర్శులు మైసా పాపారావు,చెరుకుపల్లి శ్రీనివాసరావు,జిల్లా ఎలక్ర్టానిక్ మీడియా అధ్యక్షులు గోగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,జిల్లా నాయకులు ఆవుల శ్రీనివాస్,జనార్ధనచారి,శివానందా,వై మాధవరావు,మామిడాల భూపాల్ రావు,కె సైదులు,టౌన్ ఉపాధ్యక్షులు , రాంబాబు,శీలం శ్రీనివాస్,కోశాధికారి బసవేశ్వర్ రావు,ఏలూరి వేణుగోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు
ఈ సందర్బంగా వివిధ సమస్యలపై పలువురు సీనియర్ పాత్రికేయులు ప్రవేశ పెట్టిన తీర్మాణాలను సభ ఏకగ్రీవంగా అమోదించింది.ఈ సందర్బంగా టియుడబ్యుజె ఐజెయు జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మాట్లాడ్తూ జర్నలిస్టుల ఇళ్ళ సమస్య పరిష్కరానికి తన వంతుగా క్రషి చేస్తానని హామి ఇచ్చారు.జర్నలిస్టులకు రాజీవ్ స్వగ్రహ ఇళ్ళ కేటాయింపు తోపాటు జర్నలిస్టుల హెల్త కార్డుల విషయాన్ని తాను ముఖ్యమంత్రి ద్రష్టికి తీసుకేళ్తానన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలు విద్యా,వైద్య సౌకర్యాలు ప్రభుత్వ సంస్ధలో పొందేవిధంగా ప్రజలను పాత్రికేయులు చైతన్యవంతులను చేయాలని కోరారు.మారుమూల ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వహాయంలో విద్యా,వైద్య రంగంలో విప్లవాత్మక మార్పలు వచ్చాయని వాటిని ప్రజలు సద్వీనియోగం చేసుకునే విధంగా వార్త కధనాలు రావాలని కోరారు.దీని వల్ల ప్రజల ఆర్ధిక భారం నుంచి కాపాడినవారంఅవుతామని ఆయన అభిప్రాయపడ్డారు.

.జర్నలిస్టులకు రాజీవ్ స్వగ్రహ ఇళ్ళ కేటాయింపు తోపాటు జర్నలిస్టుల హెల్త కార్డుల విషయాన్ని తాను ముఖ్యమంత్రి ద్రష్టికి తీసుకేళ్తానన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలు విద్యా,వైద్య సౌకర్యాలు ప్రభుత్వ సంస్ధలో పొందేవిధంగా ప్రజలను పాత్రికేయులు చైతన్యవంతులను చేయాలని కోరారు.మారుమూల ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వహాయంలో విద్యా,వైద్య రంగంలో విప్లవాత్మక మార్పలు వచ్చాయని వాటిని ప్రజలు సద్వీనియోగం చేసుకునే విధంగా వార్త కధనాలు రావాలని కోరారు.దీని వల్ల ప్రజల ఆర్ధిక భారం నుంచి కాపాడినవారంఅవుతామని ఆయన అభిప్రాయపడ్డారు.

Related posts

నేను ఆరోగ్యంగా ఉన్నా.. ఎవరూ ఆందోళన చెందవద్దు: వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి!

Drukpadam

మీ చుట్టూ తిరిగినప్పుడు ఎక్కడికి పోయారు మీరు?: సజ్జలను ప్రశ్నించిన బొప్పరాజు

Drukpadam

మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన పొంగులేటి.. తొలి సంతకం దేనిపై పెట్టారంటే..!

Ram Narayana

Leave a Comment