ఖమ్మం జిల్లాపై కేసీఆర్ ఫోకస్ …
2023 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్
అందుకే జిల్లాకు రెండు రాజ్యసభ సీట్లు
ఎమ్మెల్సీ , జిల్లా అధ్యక్షుడుగా తాతా మధు నియామకం అందుకే
జిల్లాలో మరిన్ని మార్పుల దిశగా కేసీఆర్ ఆలోచనలు
ఖమ్మం జిల్లాపై సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు …2023 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా అడుగులు వేస్తున్నారు . … అందుకే జిల్లాకు చెందిన ఇద్దరికీ రాజ్యసభకు టికెట్స్ ఇవ్వడం ద్వారా జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చారు . …అంతే కాకుండా తాతా మధు ఎమ్మెల్సీ గా ఎంపిక చేయడం …ఆయనకు జిల్లా అధ్యక్ష భాద్యతలు అప్పగించడం కూడా జిల్లా టీఆర్ యస్ రాజకీయాలలో కూడా కీలక పరిణామంగానే మారిందనే అభిప్రాయాలు ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికల కోసం కేసీఆర్ ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తున్నారు … ఎన్నిక ఏదైనా దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం కేసీఆర్ నైజం …అందులో భాగంగానే 2014 ,2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక్కొక్క సీటు మాత్రమే గెలిచిన టీఆర్ యస్ ను ఈసారి ఆ సంఖ్యను పెంచాలని సీఎం కేసీఆర్ గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా రాజ్యసభకు మూడు సీట్లకు మాత్రమే ఎన్నికలు వచ్చినప్పటికీ ఖమ్మం జిల్లాకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు . ఒకేసారి జిల్లాకు చెందిన చెందిన ఇద్దరు ప్రముఖులను రాజ్యసభకు పంపేందుకు సిద్ధమైయ్యారు . అందులో ఒకటి రెండు సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉన్న రాజ్యసభ సీటు ను ప్రముఖ గ్రానైట్ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర , అలియాస్ గాయత్రీ రవికి ఇచ్చారు . మరో సీటు ఇదే జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త హెటిరో డ్రగ్స్ కు చెందిన బండి పారధసారథి రెడ్డికి ఇచ్చారు .
ఇంతే కాకుండా జిల్లాకు చెందిన తాతా మధును ఎమ్మెల్సీగా చేయడమే కాకుండా జిల్లా అధ్యక్షుడిగా చేయడం ప్రాధాన్యత ను సంతరించుకున్నది . మధు జిల్లాలో సీఎం కేసీఆర్ ఆలోచనలు బలంగా తీసుకోని పోతారనే నమ్మకం కేసీఆర్ లో ఉంది. అందుకు అనుగుణంగానే ఆయన కార్యాచరణ ఉంటుంది. అయితే జిల్లా లో టీఆర్ యస్ కు బలమైన నాయకత్వం ఉన్నప్పటికీ ఎవరికీ వారే ఎడముఖం ,పెడముఖంగా ఉంటున్నారు . పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , తుమ్మల నాగేశ్వరరావులు పార్టీ లో ఉన్నప్పటికీ వారిని ఇటీవల ఏ కార్యక్రమానికి పిలవడం లేదనే అభిప్రాయాలూ ఉన్నాయి.
ఇన్ని పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నా జిల్లాలో ఎదో లోటు కనపడుందనే అభిప్రాయం సీఎం కేసీఆర్ లో ఉంది. అందువల్లనే ఇటీవల కొంత మంది ఖమ్మం జిల్లా లో పరిణామాలను ఆయన దృష్టికి తీసుకోని పోగా ఖమ్మం జిల్లాలో గత రెండు పర్యాయాలు శాసన సభ ఎన్నికల్లో ఒక్కొక్క సీటు మాత్రమే గెలిచాం… ఈసారి అదికూడా రాదనుకొని రంగంలోకి దిగండి …ఖమ్మం జిల్లాపై ఆశలు వదులుకొని రాష్ట్రంలోని మిగతా సీట్లు గెలవడం ద్వారా అధికారంలోకి రావాలని చుడండి చెప్పిన కేసీఆర్ సడన్ గా ఖమ్మం జిల్లా పై ఫోకస్ పెట్టడం పరిశీలకులను ఆశ్యర్యానికి గురిచేస్తుంది. ఖమ్మం జిల్లాలో ఈసారి గతంకన్నా ఎక్కువ ఫలితాలు కేసీఆర్ ఆశిస్తున్నారు . అందులో భాగంగానే జిల్లాకు చెందిన వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారు . వీరి ద్వారా లక్ష్యాలను సాదించేందుకు అడుగులు వేస్తున్నారు . ఇందులో సీఎం కేసీఆర్ ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి మరి !