Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఆత్మకూరు బరిలో బీజేపీ …జనసేన తో కలిసి పోటీ : జివిఎల్

ఆత్మ‌కూరులో జ‌న‌సేన‌తో క‌లిసి బీజేపీ పోటీ చేస్తుంది: ఎంపీ జీవీఎల్‌

  • ఏపీలో బీజేపీనే ప్ర‌త్యామ్నాయం
  • ప్ర‌ధానితో స‌త్సంబంధాలంటూ వైసీపీ దుష్ప్ర‌చారం
  • రాజ్యాంగ బాధ్య‌త‌ల్లో భాగంగానే వారిని మోదీ క‌లుస్తున్నారు
  • బీజేపీతో పొత్తు అని చంద్ర‌బాబు డ్రామాలాడుతున్నారు
  • కుటుంబ రాజ‌కీయాల‌కు వ్య‌తిరేకమ‌న్న జీవీఎల్‌

ఏపీలో బీజేపీనే ప్ర‌త్యామ్నాయం అని ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గానికి జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌లో జ‌న‌సేన‌తో క‌లిసి బీజేపీ పోటీ చేస్తుంద‌ని ఆయ‌న‌ ప్ర‌క‌టించారు. గురువారం మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా బీజేపీతో పొత్తు కోసం ఏపీలోని ప్ర‌ధాన పార్టీలు య‌త్నిస్తున్నాయ‌ని ఆయ‌న తెలిపారు. అయితే కుటుంబ పార్టీల‌కు తాము వ్య‌తిరేక‌మ‌న్న జీవీఎల్‌… ఏపీలో వైసీపీ, టీడీపీల‌తో బీజేపీకి పొత్తు ఉండద‌ని స్పష్టం చేశారు.

ఈ సంద‌ర్భంగా బీజేపీతో సంబంధాల కోసం వైసీపీ, టీడీపీ చేస్తున్న య‌త్నాల‌పై జీవీఎల్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో త‌మ‌కు స‌త్సంబంధాలున్నాయ‌ని వైసీపీ నేత‌లు ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. రాజ్యాంగ బాధ్య‌త‌ల్లో భాగంగానే వైసీపీ నేత‌ల‌తో మోదీ క‌లుస్తున్నార‌ని జీవీఎల్ చెప్పుకొచ్చారు. టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు కూడా బీజేపీతో పొత్తు అంటూ డ్రామాలాడుతున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Related posts

యూపీలో మళ్లీ బీజేపీదే విజయం .. రికార్డు సృష్టించనున్న యోగి: టైమ్స్ నౌ పోల్!

Drukpadam

రాష్ట్రపతి ముర్ముపై కాంగ్రెస్​ ఎంపీ అధిర్​ వ్యాఖ్యలపై స్పందించిన సోనియా గాంధీ!

Drukpadam

మోదీ కేబినెట్లో 20 మంది సీనియర్లకు ఉద్వాసన.. ఎందుకంటే!?

Drukpadam

Leave a Comment