Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మాస్కులు లేకుండా నో ట్రావెల్ …ఎయిర్ లైన్స్ కు డీజీసీఏ గైడ్ లైన్స్!

మాస్కులు లేకుండా నో ట్రావెల్ …ఎయిర్ లైన్స్ కు డీజీసీఏ గైడ్ లైన్స్!
-ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణికులను అనుమతించొద్దు
-దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
-ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు
-తాజా మార్గదర్శకాలు జారీ చేసిన డీజీసీఏ
-మాస్కులు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు

కరోనా తిరిగి విజృంభిస్తుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో మాస్కులు లేకుండా ప్రయాణాలు చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ తన బాధ్యతగా మాస్కులు పెట్టుకొని తిరగాలని కోరారు. కర్ణాటక రాష్ట్రం మాస్క్ లు ధరించడం తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాల్లో ప్రయాణం చేసే ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. లేని యెడల ప్రయాణికులు వెంటనే దించి వేయాలని కూడా పేర్కొన్నారు . దీంతో పౌర విమానయాన శాఖ అన్ని ఎయిర్పోర్ట్ మాస్కులు ధరించిన ప్రయాణికులను మాత్రమే లోపలికి అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. లేనియెడల ప్రయాణికులు ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి పేర్కొన్నది

కరోనా మహమ్మారి ఇప్పట్లో పోయేది కాదని తాజా కేసుల సరళి చెబుతోంది. దేశంలో మళ్లీ వేలల్లో రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో, విమాన ప్రయాణాల సందర్భంగా కొవిడ్ మార్గదర్శకాలు కచ్చితంగా పాటించేలా చూడాలని ఎయిర్ లైన్ సంస్థలకు డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) స్పష్టం చేసింది. మాస్కులు ధరించడానికి నిరాకరించే ప్రయాణికులను ఏమాత్రం ఉపేక్షించకుండా విమానాల నుంచి కిందికి దించేయాలని పేర్కొంది. విమానాశ్రయాల్లోనూ కరోనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని తెలిపింది.

 

ఎయిర్ పోర్టుల్లోనూ, విమానాల్లోనూ మాస్కులు ధరించనివారి పట్ల చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు నిర్దేశించిన నేపథ్యంలో డీజీసీఏ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.

కొవిడ్ ప్రోటోకాల్ పాటించని ప్రయాణికులను విమానం ఎక్కనివ్వకుండా నిరోధించే అధికారం ఎయిర్ పోర్టు ఆపరేటర్లకు ఉంటుందని, కొన్ని సందర్భాల్లో కొవిడ్ నిబంధనలు అతిక్రమించే ప్రయాణికులను భద్రతా సిబ్బందికి అప్పగించవచ్చని డీజీసీఏ స్పష్టం చేసింది. కొన్ని తప్పనిసరి పరిస్థితులు, ప్రత్యేక సందర్భాల్లోనే మాస్కులు తీసేసేందుకు అనుమతి ఉంటుందని పేర్కొంది.

Related posts

గవర్నర్ తమిళిసైపై సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు రిట్ పిటిషన్!

Drukpadam

మాట— మర్మం

Drukpadam

వరంగల్ సెంట్రల్ జైల్ స్థానంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి…

Drukpadam

Leave a Comment