Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సండ్ర కు లైన్ క్లియర్ అయినట్లేనా?

సండ్ర కు లైన్ క్లియర్ అయినట్లేనా?
-మంత్రి వర్గంలో మార్పులు ఖాయమేనా ??
-వెంకటవీరయ్య మేడలో టీఆర్ యస్ కండువా
-జిల్లాలో మిగిలింది ఇద్దరే
-వారిలో ఒకరిపై టీఆర్ యస్ వల
ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన సండ్ర వెంకటవీరయ్యకు లైన్ క్లియర్ అయినట్లేనా ? మంత్రి వర్గంలో మార్పులు ఉంటాయా ?ఉంటె వెంకటవీరయ్య కు ఆవకాశం దక్కుతుందా ?అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి . తెలంగాణాలో తెలుగుదేశంకు ఇద్దరు శాసన సభ్యులు ఉన్నారు. వారు ఇరువురు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి ,అశ్వారావు పేట నియోజకవర్గాల నుంచి ఎన్నికైయ్యారు. వెంకటవీరయ్య శానసభ ఎన్నికలు అయినా కొద్దీ నెలలకే తెలుగుదేశంకు దూరమైయ్యారు. అప్పటి నుంచి అనధికార టీఆర్ యస్ సభ్యుడుగా కొనసాగుతున్నారు. కార్యక్రమాలు అన్ని టీఆర్ యస్ పార్టీ నిర్ణయాల మేరకు చేస్తున్నా , పార్టీ కండువా కప్పుకోలేదు. బుధవారం తెలుగుదేశం కు చెందిన అశ్వారావుపేట శాసనసభ్యుడు మెచ్చ నాగేశ్వరరావు కూడా ఆపార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ యస్ లో చేరారు. చేరటమే కాకుండా తెలుగుదేశం శాసనసభ పక్షాన్ని టీఆర్ యస్ శాసనసభ పక్షంలో విలీనం చేయమని కోరుతూ స్పీకర్ కు లేఖ అందజేశారు. స్పీకర్ అసెంబ్లీ కార్యదర్శి ద్వారా తెలుగుదేశం టీఆర్ యస్ లో విలీనం అయినట్లు ప్రకటించారు. వెంకటవీరయ్య మేడలో గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో తెలంగాణ అసెంబ్లీలో తెలుగుదేశానికి స్థానం లేకుండా పోయింది . తెలుగుదేశం శాసనసభ పక్షం టీఆర్ యస్ లో విలీనం కావడంతో అధికారికంగా తెలుగుదేశం శానసభ్యులు టీఆర్ యస్ సభ్యులైయ్యారు. గతంలో వెంకటవీరయ్య ను మంత్రి వర్గంలో కి తీసుకొంటారని వార్తలు వచ్చాయి. అయినా ఆయన తెలుగుదేశం నుంచి దూరం జరిగి టీఆర్ యస్ అనధికార సభ్యుడైనప్పుడే ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. మాదిగ సామాజికవర్గం నుంచి మంత్రివర్గంలో ఎవరు లేనందున సండ్రకు ఆవకాశం దక్కుతుందని అనుకున్న అది జరగలేదు. కాంగ్రెస్ నుంచి వచ్చిన సబితా ఇంద్రారెడ్డి కి మంత్రి పదవి దక్కింది . సామాజిక సమీకరణలలో కేసీఆర్ మంత్రి వర్గంలో మాదిగ సామాజీగా వర్గం నుంచి ఎవరు లేకపోటంతో వెంకటవీరయ్య ఛాన్స్ ఉంటుందనే అభిప్రాయాలూ ఉన్నాయి. ఆయన తరుచు ముఖ్యమంత్రి కేసీఆర్ కలవటం తో జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరుతుంది. వెంకటవీరయ్య సీనియర్ శాశనసభ్యుడుగా ఉన్నారు. సత్తుపల్లి నుంచి గత మూడు పర్యాయాలు నుంచి ఎన్నికవుతున్నారు.గతంలో పాలేరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా గత ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి టీఆర్ యస్ తరుపున ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ ఒక్కరే గెలవగా వైరా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన రాములు నాయక్ గెలుపొందారు. ఆయన వెంటనే టీఆర్ యస్ తీర్థం పుచ్చుకున్నారు. తరువాత కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆరుగురిలో నలుగురు అధికార టీఆర్ యస్ లో చేరారు. ఇక మిగిలిన నలుగురిలో ఇద్దరు తెలుగు దేశం కు చెందినవారుకాగా మరో ఇద్దరు కాంగ్రెస్ కు చెందిన వారు . ఇప్పుడు టీడీపీ సభ్యులు తమ పార్టీ శానసభ పక్షాన్ని టీఆర్ యస్ లో విలీనం చేసిన తరువాత కాంగ్రెస్ కు చెందిన మధిర ,భద్రాచలం శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క , పోడియం వీరయ్యలు మాత్రమే మిగిలారు. పోడియం వీరయ్య కోసం టీఆర్ యస్ ఎప్పటినుంచో వల వేస్తుంది . ఆయన టీఆర్ యస్ లో చేరుతున్నుట్లు వార్తలు కూడా వచ్చాయి. అయినప్పటికీ ఆయన చేరలేదు. ఒక్కరిదగ్గర నుంచి 8 మంది టీఆర్ యస్ ఎమ్మెల్యేలు అయ్యారు. ఇప్పుడు మంత్రిగా పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నారు. ఆయన జిల్లాలో తన మార్క్ కోసం శ్రమిస్తున్నారు. ఖమ్మం నగరంలో అనేక అభివృద్ధి పనులను చేపట్టారు. డైనమిక్ మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. మంత్రి వర్గంలో మార్పులు జరిగితే ఖమ్మం జిల్లాకు అదనంగా మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తే తప్ప వెంకవీరయ్య కు ఆవకాశం లేదు. జిల్లా నుంచి సీనియర్ నాయకులుగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల ,మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లు కేసీఆర్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్యే ల నుంచి ఎమ్మెల్సీలను వచ్చే నెలలో ఎన్నుకోవాల్సి ఉంది . అందులో ఖమ్మం జిల్లాకు ఆవకాశం ఉంటుందా లేదా ? ఉంటె ఎవరిని తీసుకుంటారు . అనేదానిపై రాజకీయవర్గాలలో ఆశక్తి కార చర్చ జరుగుతుంది.

Related posts

బెంగాల్‌లో శాసన మండలి ఏర్పాటుకు మమతా సర్కార్ ప్రయత్నాలు…

Drukpadam

కుట్ర మహా కుట్ర …బీజేపీ గేమ్ ప్లాన్ లో భాగమేనా …?

Drukpadam

సినీ పరిశ్రమ సమస్యలు సీఎం దృష్టికి తెచ్చేందుకు చిరంజీవి కృషి అభినందనీయం :నాని

Drukpadam

Leave a Comment