జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం
భారీ బైక్ ర్యాలీ
రానున్న రోజుల్లో జనసేన పార్టీ సేవలు మరింత విస్తృతంచేస్తాం

ఖమ్మంలో జనసేన హడావుడి చేస్తుంది. షర్మిల పర్యటనకు ఒక రోజు ముందు హడావుడి చేయడంపై ఆశక్తి నెలకొన్నది.
కార్యకర్తల వేడుకల మధ్య జనసేన పార్టీ కార్యాలయాన్ని ఖమ్మం నగరంలో గురువారం ప్రారంభించారు స్థానిక శ్రీశ్రీ సర్కిల్ ప్రాంతంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంఛార్జి రాంతాళ్ళూరి ఆధ్వర్యంలో ప్రారంభించారు .

అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి రెండు కళ్ళు వంటివని , రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఆయన పోరాడుతున్నారన్నారని రాంతాళ్ళూరి అన్నారు . ఆయన ఆశయాల మేరకు రెండు రాష్ట్రాల్లోని పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేస్తున్నారని , ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసే క్రమంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఖమ్మం నగరంలో ప్రారంభించినట్లు రాంతాళ్ళూరి తెలిపారు

. ప్రశ్నించే తత్వంతో పార్టీ ఏర్పడిందని , ప్రజల సమస్యల పరిష్కారంలో పార్టీ నాయకులనైనా , అధికారులనైనా ప్రశ్నిస్తుందని , తద్వారా సమస్యల పరిష్కారంలో ముందుంటామన్నారు . భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికలలోనూ జనసేన పార్టీ పోటీ చేస్తుందని , క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు తమ బలమన్నారు . పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో పూర్తిస్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కార్యక్రమాలను నిర్వహించనున్నామని , దీనికి తాము ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని తెలిపారు . కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఖమ్మం జిల్లాల్లో రాజకీయ చైతన్యం కలిగిన కార్యకర్తలు జనసేన పార్టీకి బలమన్నారు . ఎంతో ఉత్సాహంతో , మరెంతో సేవాభావంతో తమ కార్యకర్తలు నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుంటారన్నారు . జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఖమ్మం వచ్చినపుడు ఖమ్మం జిల్లా ప్రజలు రాజకీయ చతురతను ప్రదర్శిస్తారని , మంచి వారిని ఎన్నికల్లో గెలిపిస్తారని , దీనికి తగ్గట్లుగానే రానున్న రోజుల్లో జరుగనున్న ఎన్నికల్లో జనసేన పార్టీ విజయడంగా మ్రోగించడం ఖాయంగా కనిపిస్తోందన్నారు . కార్యాలయ ప్రారంభోత్సవానికి ముందుగా ఖమ్మం నగరంలో భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు .ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి అర్యామ్ ఖాన్ , తెలంగాణ ఇంఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ , కార్యనిర్వాహక కార్యదర్శి వి.వి.రామారావు , జిహెచ్ ఎంసి ప్రెసిడెంట్ రాధారామ్ రాజలింగం , సాంస్కృతిక విభాగం రాష్ట్ర కార్యదర్శి దుంపట శ్రీనివాస్ , ఉమ్మడి వరంగల్ ఇంఛార్జి ఆకుల సుమన్ , యువజన విభాగం అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్ , విద్యారథి విభాగం అధ్యక్షులు సంపత్ నాయక్ , ఖమ్మం నగర కమిటీ అధ్యక్షులు మిరియాల జగన్ , ఖమ్మం నగర సమస్ఘయకర్త ఎండి.సాధిక్ అలీ , ఖమ్మం నగర ప్రధాన కార్యదర్శి సురభి సూరజ్ కిరణ్ , పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు .