ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఉద్రిక్తత… కుర్చీలతో కొట్టుకున్న న్యాయవాదులు!
- బార్ కౌన్సిల్ ఎన్నికలపై చర్చించేందుకు సమావేశం
- న్యాయవాదుల మధ్య భేదాభిప్రాయాలు
- పరస్పరం ఘర్షణ
- బార్ కౌన్సిల్ సభ్యుడు అజయ్ కుమార్ కు గాయం
- సీజేని కలిసేందుకు న్యాయవాదుల యత్నం
ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం రసాభాస అయింది. బార్ కౌన్సిల్ ఎన్నికలపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహించారు. అయితే, న్యాయవాదుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో ఉద్రిక్తతలకు దారితీసింది. పలువురు న్యాయవాదులు చేతికందిన కుర్చీలతో యుద్ధానికి దిగారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది.
ఈ ఘటనలో బార్ కౌన్సిల్ సభ్యుడు చలసాని అజయ్ కుమార్ గాయపడ్డారు. ఆయన తలకు దెబ్బ తగిలింది. ఈ ఘర్షణల నేపథ్యంలో అజయ్ కుమార్, ఇతర న్యాయవాదులు హైకోర్టు సీజేని కలిసేందుకు యత్నించారు. కాగా, ఈ సమావేశంలో న్యాయవాదులు రాయలసీమ, కోస్తా వర్గాలుగా విడిపోయి పరస్పరం ఘర్షణకు దిగినట్టు తెలుస్తోంది. పోలీసుల జోక్యంతో న్యాయవాదులు శాంతించారు.