Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

శివసేన రెబెల్స్ కు బంపరాఫర్ ప్రకటించిన బీజేపీ!

శివసేన రెబెల్స్ కు బంపరాఫర్ ప్రకటించిన బీజేపీ!
-గువాహటిలో క్యాంపు వేసిన శివసేన రెబెల్స్
-వారున్న హోటల్ కు వెళ్లిన అసోం మంత్రి అశోక్ సింఘాల్
-8 కేబినెట్ మంత్రులు, ఐదు సహాయక మంత్రి పదవులు ఆఫర్ చేసినట్టు సమాచారం

మహారాష్ట్ర రాజకీయాలు దేశ వ్యాప్తంగా వేడి పుట్టిస్తున్నాయి. శివసేన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు, మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ అడుగులు వేస్తోంది. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలను తనవైపు లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఏక్ నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు గువాహటిలోని రాడిసన్ బ్లూ హోటల్ లో క్యాంపు వేశారు.

తాజాగా ఈ హోటల్ కు అసోం మంత్రి అశోక్ సింఘాల్ చేరుకుని, వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ సందర్భంగా వారి ముందు భారీ ఆఫర్ ఉంచినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఎనిమిది కేబినెట్ మంత్రి పదవులు, ఐదు సహాయక మంత్రి పదవులు ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసింది. ఒకవేళ శివసేన ఎంపీలు వస్తే కేంద్రంలో రెండు మంత్రి పదవులు ఇస్తామని చెప్పినట్టు సమాచారం. మరోవైపు శివసేన కీలక నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ… రెబెల్స్ లోని 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని ప్రకటించడం గమనార్హం.

Related posts

రెడ్ల వర్గం నీకేం ద్రోహం చేసింది.. పోస్టులు ఎందుకు షేర్ చేస్తున్నారు?

Drukpadam

షర్మిల …బీజేపీ ఎంపీ అరవింద్ మధ్య మాటల యుద్దం

Drukpadam

కాంగ్రెస్ పార్టీ కమిటీకి కొండా సురేఖ షాక్ …

Drukpadam

Leave a Comment