Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నేను ప్రజలు వదిలిన బాణాన్ని …షర్మిల

నేను ఎవరో వదిలిన బాణాన్ని కాదు .

నేను గడ్డమీదే బతికా రుణం తీర్చుకుంటా .

ఇక్కడే చదివాను,కొడుకు కుతూరు ఇక్కడే పుట్టారు

కేసీఆర్ మాటలు తప్ప చేతలు లేవు


ఖమ్మం : సంకల్ప సభలో జోహార్ వైఎస్సార్.. జై తెలంగాణ అంటూ , ఉద్యమంలో అమరులైనవారికి నా వందనాలు అంటూ షర్మిల ప్రసంగం ప్రారంభించారు .108 అంబులెన్స్ ఆలోచనను వైఎస్ తప్ప ఏనాయకుడూ చేయలేదని , అభివృద్ధి , సంక్షేమం రెండు కళ్లుగా వైఎస్ పాలన సాగిందాని , ప్రైవేట్ రంగంలోనూ వైఎస్ 11 లక్షల ఉద్యోగాలు కల్పించారని , మహిళలు లక్షాధికారులు కావాలని వైఎస్ కలలు కన్నారాని , ఇప్పుడున్న నాయకుడు ఏ ఒక్కడైనా అలా ఉన్నారా అని ప్రశ్నించారు . నీళ్లన్నీ కేసీఆర్ ఫామ్ హౌస్కే , నిధులు కూడా వారికే ఆత్మగౌరవం దొర చెప్పుకింద పడి నలిగిపోతోందాని వారికి ఓటేస్తేనే జీతాలు పెంచుతామని టీచర్లను బెదిరించారు . తను అడుగుపెట్టని సచివాలయం ఎందుకని కూల్చేశాడు . సచివాలయంలో అడుగుపెట్టని ఇలాంటి CM దేశంలో ఎవరూ లేరు . యువత ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు . kcr హయాంలో ఒక్క కొత్త కార్డు రాలేదు ? కేసీఆర్ ఇప్పటి వరకు ఎన్ని ఇళ్లు కట్టించారో చెప్పాలి . అడిగిన ప్రతి ఒక్కరికి వైఎస్ తెల్లరేషన్ కార్డు ఇచ్చారు . ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అన్నారు ఏమైంది ? సింగరేణి కార్మికుల మైనింగ్ సమస్య తీరిందా ? ఇప్పుడు యువతకు ఉద్యోగాలు లేవు నిరుద్యోగ భృతి ఏమైంది ? కేసీఆర్ చెప్పిన కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమైంది ? రైతుల పేరుతో అప్పులు తెచ్చి పాలకులు జేబులు నింపుకుంటున్నారు . 30 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే మీకు చీమకుట్టినట్లు లేదు దళితులకు మూడెకరాల భూమి ఏమైంది సీఎం సారూ ? కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు మీకు పట్టవా ? తెలంగాణ వచ్చాక కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయి . రాష్ట్రం రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే 2వ సానంలో ఉంది . 6వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు . ప్రజా సమస్యలు వినే ఓపిక ఈ దొరలకు ఉందా ? నేను ఈ గడ్డమీదే బతికా.. రుణం
తీర్చుకోవాలనుకోవడం తప్పా ? రాజన్న సంక్షేమ పాలనను తిరిగి తీసుకొచ్చే ఉద్దేశంతోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్నాని , జులై 8 వైఎస్ ఆర్ జయంతి రోజున పార్టీ పేరును ప్రకటిస్తానని పేర్కొన్నారు .

Related posts

టీటీడీ ‘ప్రత్యేక ఆహ్వానితులకు’ హైకోర్ట్ బ్రేక్

Drukpadam

ఖతర్‌‌ను వీడి.. ఆఫ్ఘనిస్థాన్‌కు పయనమైన తాలిబన్ అగ్రనేత!

Drukpadam

DriveShare Lets You Rent Your Dream Car From A Car Collector

Drukpadam

Leave a Comment