Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అల్లూరి ఓ నిప్పు కణం :సీఎం జగన్

అల్లూరి ఓ నిప్పు కణం …

  • విగ్రహావిష్కరణ సభలో ఏపీ ముఖ్యమంత్రి జగన్
  • మోడీకి విల్లంబు, అమ్ముల పొది బహుకరణ

అల్లూరి సీతారామరాజు ఒక అగ్నికణమని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొనియాడారు. భీమవరంలో జరిగిన అల్లూరి కాంశ్య విగ్రహావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. తెలుగు జాతికే కాకుండా, యావత్ దేశానికి అల్లూరి ఒక స్ఫూర్తిప్రదాతని అన్నారు. ఆయన ఘనతను గుర్తుంచుకోవడానికే ఆయన పేరుపై జిల్లాను ఏర్పాటు చేశామని చెప్పారు. అల్లూరి చేసిన త్యాగం ప్రతి మనిషి గుండెలో చిరకాలం నిలిచిపోతుందన్నారు. ఆయన తెలుగుగడ్డపై పుట్టడం మనందరి అదృష్టమని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి జగన్ సభలో ప్రధాని మోదీని సత్కరించారు. ప్రధానికి విల్లంబు, సీతారాముల పటాన్ని బహూకరించారు. సభావేదికపై మోదీ, జగన్ లతో పాటు గవర్నర్ హరిచందన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి రోజా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, సినీ నటుడు చిరంజీవి తదితరులు ఉన్నారు.

Related posts

 9 సెకన్లలో కూలన సూపర్‌టెక్ ట్విన్ టవర్స్.. ఆసక్తికర అంశాలు ఇవే!

Drukpadam

మేడే రోజు ఉద్యోగులకు చేదు కబురు …ఐదేళ్లలో కోటిన్నర ఉద్యోగాలు పోతాయట..

Drukpadam

ఏపీ సీఎం జ‌గ‌న్ పారిస్ టూర్ ఖ‌రారు… రేపు సాయంత్రం ఫ్లైటెక్క‌నున్న జ‌గ‌న్‌!

Drukpadam

Leave a Comment