Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వైసీపీలో జోష్ నింపిన తొలిరోజు ప్లీనరీ …

వైసీపీలో జోష్ నింపిన తొలిరోజు ప్లీనరీ …
పార్టీకి బూస్ట్ గా జగన్ , విజయమ్మ ఉపన్యాసాలు
వైసీపీ ప్లీన‌రీలో ముగిసిన‌ తొలి రోజు స‌మావేశాలు… 4 తీర్మానాల‌కు ఆమోదం
జ‌గ‌న్ ప్రారంభోప‌న్యాసంతో మొద‌లైన ప్లీన‌రీ
విజ‌య‌మ్మ స‌హా ప‌లువురు మంత్రుల ప్ర‌సంగాలు
రేపు 5 తీర్మానాల‌ను ప్ర‌వేశపెట్ట‌నున్న నేత‌లు

 

ఐదు సంవత్సరాల తర్వాత మంగళగిరి సమీపంలో జరుగుతున్న వైసీపీ ప్లీనరీ సమావేశాలు కార్యకర్తల్లో జోష్ నింపాయి. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చారు . ప్లీనరీ సమావేశానికి రారు అనుకున్న వైయస్ విజయమ్మ కుమారుడు సీఎం జగన్ తో కలిసి ఇడుపులపాయ నుంచి నేరుగా ప్లీనరీ వద్దకు చేరుకున్నారు . తొలుత జెండా ఆవిష్కరణ చేసి ప్లీనరీ సమావేశాలను ప్రారంభించిన సీఎం పార్టీ అధ్యక్షుడు అయిన జగన్ ప్రతిపక్షాల విమర్శలకు దీటుగా జవాబు ఇచ్చారు . ఎవరెన్ని కుట్రలు చేసిన తన గుండె చెదరదు…సంకల్పం

వైసీపీ ప్లీన‌రీలో భాగంగా శుక్ర‌వారం సాయంత్రం తొలి రోజు స‌మావేశాలు ముగిశాయి. శుక్ర‌వారం ఉద‌యం 11 గంట‌ల ప్రాంతంలో మొద‌లైన స‌మావేశాలు సాయంత్రం దాకా కొన‌సాగాయి. పార్టీ అధినేత హోదాలో సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రారంభోప‌న్యాసం చేయ‌గా… పార్టీ గౌర‌వాధ్య‌క్షురాలు వైఎస్ విజ‌య‌మ్మ కూడా ప్ర‌సంగించారు. ఆ త‌ర్వాత జ‌గ‌న్ కేబినెట్‌లోని ప‌లువురు మంత్రులు ఆయా అంశాల‌పై ప్ర‌సంగాలు చేశారు. సంకల్పం మరదన్న మాటలకూ ప్రతినిధులు ఉప్పొంగిపోయారు . తరువాత వైసీపీ గౌరవ అధ్యక్షులు హోదాలో ఉన్న విజయమ్మ చేసిన ప్రసంగం ఆలోచింపచేసేదిగా ఉంది. తాను తన కూతురు తెలంగాణాలో తండ్రి ఆశయాల సాధనకోసం ఒంటరి పోరాటం చేస్తునందున ఆమెకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నందున తన పదవికి వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు .

మొదటి రోజున నాలుగు తీర్మానాలు ఆమోదించారు . మంత్రులు ,ఎమ్మెల్యేలు ,నాయకులూ తీర్మానాలపై ప్రసంగించారు . మంత్రి చిదిరి అప్పలరాజు కళాకారులతో కలిసి పాటలు పడటం ఆసక్తి గొలిపింది.

తొలి రోజు ప్లీన‌రీలో వైసీపీ నేత‌లు 4 తీర్మానాలు ప్ర‌వేశ‌పెట్ట‌గా…వాటిని ఆమోదిస్తూ తీర్మానం చేశారు. మ‌హిళా సాధికార‌త‌- దిశ చ‌ట్టం, విద్యా రంగంలో సంస్క‌ర‌ణ‌లు, నవ ర‌త్నాలు- డీబీటీ, వైద్య ఆరోగ్య రంగంపై ఈ తీర్మానాల‌ను ఆమోదించారు. ఇక రెండో రోజైన శ‌నివారం నాటి ప్లీన‌రీలో మ‌రో 5 తీర్మానాల‌పై చ‌ర్చ‌ జ‌ర‌గ‌నున్న‌ట్లు పార్టీ నేత‌లు తెలిపారు

 

Related posts

తైవాన్ పై చైనా అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు.. ఎట్టి పరిస్థితుల్లోనూ కలిపేసుకుంటామని హెచ్చరిక!

Drukpadam

ఎల్.రమణ కారెక్కనున్నారా?…

Drukpadam

వీధుల్లో మతపరమైన కార్యకలాపాలకు నో పర్మిషన్ …యూపీ సీఎం యోగి !

Drukpadam

Leave a Comment